Khammam District (imagecredit:swetcha)
ఖమ్మం

Khammam District: ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావడం లేదని.. ధర్నా చేస్తూ యువతి ఆత్మహత్య!

Khammam District: ఉద్యోగాన్వేషన్లో భాగంగా ఓ యువకుడు హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటుండగా అక్కడే పరిచయమైన యువతితో ప్రేమ చిగురించగా, తీరా పోలీస్ కానిస్టేబుల్(Constable) జాబ్ వచ్చాక తనతో వివాహానికి నిరాకరిస్తున్నాడని యువతి న్యాయపోరాటం చేసి చివరకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఎప్పటికైనా మారుతాడనే నమ్మకంతో ఖమ్మం(Khammam) జిల్లా నుంచి వేడి ప్రియుడి ఇంట్లోనే ఉంటూ వస్తోంది. చివరికి ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి వద్ద కొన్ని నెలలుగా నిరసన చేస్తున్న ఓ యువతి మనస్తాపానికి గురై పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది.. గట్టు(Gattu) మండలానికి చెందిన ఓ కానిస్టేబుల్, పాల్వాంచకు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని, పెళ్లి చేసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్య పాల్పడగా గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. యువతి మృతికి కారకులైన కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ విధుల నుండి తొలగించారు. అదే విధంగా యువతి మృతికి కారణమైన కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల మీద పలు సెక్షన్ ల కిందా గట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాని తరలించి అంత్రక్రియలు నిర్వహించారు.

గట్టు పోలీసులు తెలిపిన వివరాలిలా..

గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్ పోలీస్ ఉద్యోగాల కోసం హైదరబాద్(Hyderabad) లో శిక్షణ తీసుకునే క్రమంలో ఖమ్మం జిల్లా పాల్వాంచకు చెందిన ప్రియాంక(Priyanaka) తో(32) ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రఘునాథ్ గౌడ్ కు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రియాంకను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో జులై నెలలో రఘునాథ్ గౌడ్ స్వగ్రామమైన చిన్నోనిపల్లి గ్రామానికి చేరుకుని పెళ్లి చేసుకోమని కానిస్టేబుల్ ను కోరగా అందుకు నిరాకరించడంతో ఆమె కుటుంబ సభ్యులు గద్వాల జిల్లా పోలీసులను ఆశ్రయించారు. ప్రేమించిన యువతిని మోసం చేసిన యువకుడిని శిక్షించాలంటూ ప్రజా సంఘాలు, యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గట్టు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జైళ్లు నుంచి విడుదల అయ్యాడు.

Also Read: Conflicts in Maoists: మావోయిస్టు పార్టీలో విభేదాలు.. చివరికి ఏం జరుగుతుందో?

కానిస్టేబుల్ ఇంట్లోనే ఉంటూ నిరసన

గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామం రిజర్వాయర్ లో నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైంది. చిన్నోనిపల్లి పునారావస సెంటర్ లో కొత్తగా నిర్మించిన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ కుటుంబ సభ్యుల ఇంట్లోనే ఉంటూ గత మూడు నెలలుగా ప్రియాంక నిరసన చేస్తోంది. అక్కడే ఒంటరి పోరాటం చేస్తూ.. పెళ్లి చేసుకోవాలని వేడుకోని రోజులు లేవంటూ స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ప్రియాంకతో కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి శుక్రవారం మద్యాహ్నం పురుగుల మందు సేవించింది. గమనించిన స్థానికులు గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆమె ఆసుపత్రి నుంచి తిరిగి చిన్నోనిపల్లి గ్రామానికి చేరుకోగా, పరిస్థితి విషమించడంతో తిరిగి ఆమెను శుక్రవారం రాత్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ, ఆరోగ్యం క్షీణించడంతో శనివారం ఉదయం ఆమె మృతి చెందింది.

యువతి మృతికి కారకులపై చర్యలు..

కానిస్టేబుల్‌ రఘునాథ్ గౌడ్ ప్రేమ పేరుతో పాల్వంచకు చెందిన ప్రియాంక అనే యువతిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతిరాలి కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. ప్రియాంక ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టాలన్నారు, పోలీసు వారు ఈ కేసులో ఎలాంటి వివక్ష లేకుండ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

విధుల నుండి తొలగింపు

ప్రియాంక మృతికి కారకులైన కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్(Raghunath Goud) ను పర్మినెంట్ గా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు(డిస్మిస్ చేస్తున్నట్లు) జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస్(SP Srnivass) రావు తెలిపారు. ప్రియాంక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని, అందుకు బాద్యులైన వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కాగా మృతురాలి తల్లి కే. ఆదిలక్ష్మీ, రాంబాబు ఫిర్యాదు మేరకు మృతికి కారకులైన రఘునాథ్ గౌడ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు 21మంది పై ఎస్సీ(SC), ఎస్టీ(ST) అట్రాసిటి కేసుతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు గట్టు ఎస్ఐ కె.టి.మల్లేష్ తెలిపారు.

Also Read: Local Body Elections: స్థానిక అభ్యర్ధుల ఎంపికలో టీపీసీసీకి సవాల్.. రాహుల్ గాంధీ రూల్‌కు నై అంటున్న లీడర్లు

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?