ASP Vikranth Kumar Singh: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పోలీస్(Police) శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్(ASP Vikrant Kumar Singh) పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohith Raju) ఆదేశాలతో చర్ల మండలంలోని చత్తీస్గడ్ రాష్ట్ర(Chhattisgarh State) సరిహద్దు గ్రామాలైన బట్టిగూడెం(Battigudem), బత్తినపల్లి(Bathinapally), రామచంద్రపురం(Ramachendhrapuram) గ్రామాలను సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ కంపెనీ కమాండర్ సెబస్టియన్, చర్ల సీఐ రాజు వర్మ ఇతర పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి ఏఎస్పీ సందర్శించారు.
ఆదివాసీలకు విద్య వైద్యం
ఈ మూడు మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోని 120 కుటుంబాలను కలిసి వారితో ముచ్చటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు nestle నెస్లే కంపెనీ సహకారంతో నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ… మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు విద్య వైద్యం రవాణా పంటి కనీస సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.
Also Read: Khammam District: కోట మైసమ్మ తల్లి జాతరకు పోటెత్తిన జనం.. ఎక్కడంటే?
ఎవరు కూడా సహకరించ వద్దు
వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసి(Tribal) ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల అనంతరం పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. డెంగీ, మలేరియా, విష జ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. అభివృద్ధి నిరోధకులైన నిషేధిత మావోయిస్టులకు ఎవరు కూడా సహకరించొద్దని కోరారు. ప్రత్యక్షంగా నైనా పరోక్షంగా నైనా మావోయిస్టులకు సహకరించొద్దని విజ్ఞప్తి చేశారు. పోలీసుల ఆంక్షలు పట్టించుకోకపోతే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మారుమూల ఏజెన్సీ ప్రజలకు నిత్యవసర వస్తువులను అందించడానికి ముందుకు వచ్చిన నెస్లే కంపెనీ నిర్వాహకులను అభినందించారు.
Also Read: India’s Top Billionaires: దేశంలోనే అపరకుబేరులు.. వారు ఏం చదివారో తెలిస్తే.. తప్పక షాకవుతారు!
