South Central Railway: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు
South Central Railway (imagecredit:twitter)
హైదరాబాద్

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు.. మునుపటి ఆదాయాన్ని బ్రేక్ చేసి మరీ లాభాలు

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.10143 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది. రికార్డు ఆదాయం సాధించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సరుకు రవాణా రంగంలో 71.14 మిలియన్ టన్నులను, సరుకు రవాణాలో రూ.6635 కోట్ల ఆదాయాన్ని మరియు ప్రయాణీకుల విభాగం నుంచి రూ.2991 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సరుకు రవాణా, ప్రయాణీకుల విభాగాలలో అత్యుత్తమ పనితీరును కనబరిచిందన్నారు. జోన్ 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.10143 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసిందని, ఇది 2024-25లో నమోదైన మునుపటి అత్యుత్తమ ఆదాయమైన రూ 9966 కోట్ల కంటే 1.7శాతం ఎక్కువ అని పేర్కొన్నారు. ఈ కాలంలో రూ.2991 కోట్లు ప్రయాణీకుల నుంచి ఆదాయం, రూ.6635 కోట్ల సరుకు రవాణా ఆదాయం దీనికి దోహదపడిందన్నారు. జోన్ మునుపెన్నడూ లేని విధంగా సరుకు రవాణాలో 71.14 మిలియన్ టన్నుల సరకు లోడింగ్‌ను సాధించిందని, ఇది 2024-25లో లోడ్ చేయబడిన 67 మిలియన్ టన్నుల మునుపటి ఉత్తమ సరుకు రవాణా లోడింగ్ కంటే 6 శాతం ఎక్కువ అని వెల్లడించార

మొదటి 6 నెలల్లో..

దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది అసాధారణ సమిష్టి కృషి, అన్ని విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఫలితంగా రికార్డు స్థాయి పని తీరును సాధించగలిగిందని వెల్లడించారు. జోన్లోని ప్రస్తుత సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూనే, సరుకు రవాణా విభాగంలో నూతన పంథాలను ప్రవేశపెడుతున్నారు. ఈ దిశలో నిరంతర ప్రయత్నం ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో జోన్ 71.14 మిలియన్ టన్నుల సరుకు రవాణా వస్తువులను రవాణా చేయడం ద్వారా అత్యుత్తమ సరుకు రవాణాను నమోదు చేసిందన్నారు. ఇదే కాలంలో గత సంవత్సరంలోని సరుకు రవాణా కంటే ఇది 4.13 మిలియన్ టన్నులు ఎక్కువ (67 మిలియన్ టన్నులు ) అని, ఇనుప ఖనిజం, ఉక్కు కర్మాగారాలకు ముడి పదార్థాలు, సిమెంట్ మొదలైన వస్తువుల లోడింగ్ పెరగడం వల్ల సరుకు రవాణాలో మెరుగుదల ప్రధానంగా ఉందన్నారు.

Also Read: Sree Vishnu: మరో సినిమా ప్రారంభించిన హీరో శ్రీ విష్ణు.. వారి కాంబోలో ఇది రెండో చిత్రం

ఆదాయం పరంగా..

అదే సమయంలో, వీలైనంతవరకు అవసరమైన చోట ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి , నడపడానికి జోన్ ప్రయాణీకుల రవాణా ధోరణులను నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్రవేశపెట్టిన రైళ్లు మంచి ఆదరణతో నడుస్తున్నాయన్నారు. అదనంగా, డిమాండ్, సాధ్యాసాధ్యాలు ఉన్న చోట జోన్ అదనపు కోచ్‌ లతో రైళ్లను నడుపుతోందని, ప్రత్యేక రైళ్ల నిర్వహణకు అదనంగా దీని వలన వెయిట్‌లిస్ట్ లోనున్న ప్రయాణీకులకు ఉపయోగపడుతోందన్నారు. ప్రయాణీకుల ఆదాయం పరంగా, ఈ కాలంలో జోన్ రూ. 2991 కోట్ల ఆదాయాన్ని సాధించిందని, ఇది గత సంవత్సరం గడించిన రూ. 2909 కోట్ల కంటే 2.8 శాతం అధికం అని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ అద్భుతమైన ఆదాయం సాధించినందుకు సంతృప్తి గా ఉందని, దక్షిణ మధ్య రైల్వే బృందాన్ని అభినందించారు. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్తమ పనితీరును సాధించడానికి అన్ని డివిజన్లు , ప్రధాన కార్యాలయాల సిబ్బంది, అధికారులు ఇదే స్పూర్తితో ఒకే వేగాన్ని కొనసాగించాలని సూచించారు.

Also Read: Unique Train Toilet: ఓరి దేవుడా ఇది కలా నిజమా.. రైలులో 5 స్టార్ బాత్రూమ్.. ఎంత బాగుందో!

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!