Sree Vishnu: మరో సినిమా ప్రారంభించిన హీరో శ్రీ విష్ణు..
sri-vishtnu(image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Sree Vishnu: మరో సినిమా ప్రారంభించిన హీరో శ్రీ విష్ణు.. వారి కాంబోలో ఇది రెండో చిత్రం

Sree Vishnu: ‘సామజవరగమన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అబ్బరాజు మరో సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా కు శ్రీ విష్ణు, అబ్బరాజు 2 అనే టైటిల్ తో షూటింగ్ ప్రారంభించనన్నారు. దీంతో విష్ణు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా రోజునే ప్రారంభించారు. ఇది ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఇప్పటికే సామజవరగమన సినిమా శ్రీ విష్ణు కెరీర్‌లో అతి గొప్ప హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలోని కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ కాంబో మళ్లీ కలిసి వస్తున్నందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కొత్త చిత్రం కూడా వినోద భరితంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘ఫన్ రీలోడెడ్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుందని అధికారిక ప్రకటనల్లో తెలిపారు. ఈ కాంబోలో రాబోతున్న రోండో సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Madhya Pradesh: శిశువును చెత్తలో పడేసి.. పైన బండరాయి పెట్టిన తల్లిదండ్రులు.. 72 గంటల తర్వాత..

ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నారు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు కథను రాసి, దర్శకత్వం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ రెడ్డి, చిరంజీవి పెద్ది నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో వర్కహాలిక్ నటుడు నరేష్, కామెడీ కింగ్ వెన్నెల కిషోర్, సుదర్శన్ కూడా భాగమవుతున్నారు. ఇది సినిమాకు మరింత హాస్య రసం జోడిస్తుందని అంచనా. ప్రారంభోత్సవంలో సాయి ధరం తేజ్, రోహిత్ నారా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ దసరా సందర్భంగా గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రేక్షకులు ఈ ‘ఫన్ రీలోడెడ్’కి ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వస్తాయని నిర్మాణ బృందం ప్రకటించింది.

Read also-Airtel Recharge Plan: అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. రూ.199కే హైస్పీడ్ 5జీ, అపరిమిత కాల్స్.. వర్త్ మామా వర్త్!

శ్రీ విష్ణు మొదటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ ‘మృత్యుంజయ’. హస్సైన్ షా కిరణ్ దర్శకత్వంలో, జస్ట్ యెల్లో బ్యానర్‌పై గున్నం గంగారాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. రీబా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తించింది. పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. ఇది శ్రీ విష్ణు కెరీర్‌లో థ్రిల్లర్ జోన్‌లోకి ప్రవేశానికి మైలురాయి కానుంది. ‘హీరో హీరోయిన్’ (Hero Heroine)శ్రీ విష్ణు మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హీరో హీరోయిన్’. ప్రొడక్షన్‌లో ఉన్న ఈ చిత్రం, 2025 చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. కథాంశ వివరాలు ఇంకా పూర్తిగా బయటపడలేదు. కానీ హాస్యం, ఎమోషన్స్ కలిపిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని నిర్మాణ బృందం ప్లాన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్, శ్రీ విష్ణు వర్సటాలిటీని మరింత ప్రదర్శిస్తుందని అంచనా.

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..