Cheque Clearance: బ్యాంక్ చెక్కుల విషయంలో కొత్త రూల్
bank-Cheque
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Cheque Clearance: బ్యాంక్ చెక్కుల విషయంలో కొత్త రూల్.. శనివారం నుంచే అమల్లోకి

Cheque Clearance: ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం శనివారం (అక్టోబర్ 4) నుంచి బ్యాంకు చెక్కుల లావాదేవీల (Cheque Clearance) విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏ రోజు సమర్పించే చెక్కులను బ్యాంకులు అదే రోజు క్లియర్ చేయనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ సవరించిన ‘సెటిల్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్’ను బ్యాంకులు అమలు చేయనున్నాయి. చెక్కు లావాదేవీలను వేగంగా పూర్తి చేయడం, పేమెంట్ల భద్రతను మరింత పెంచడంలో భాగంగా ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.

మరింత సురక్షితం

ప్రస్తుతం అమలులో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (CTS) ద్వారా బ్యాచ్ ప్రాసెసింగ్ విధానంలో చెక్కుల క్లియరెన్స్ జరుగుతోంది. అకౌంట్‌లో నగదు జమ కావడానికి కొన్ని రోజుల సమయం పడుతోంది. అయితే, అక్టోబర్ 4 నుంచి ఏ రోజు బ్యాంకులో సమర్పించిన చెక్కు అదే పనిదినం నాడు, కొన్ని గంటల్లోనే క్లియర్ అవుతుందని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాంకులు… చెక్కుల ఫొటోలు, మాగ్నటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్‌‌ (MICR) డేటాను క్లియరింగ్ హౌస్‌కు పంపిస్తాయి. క్లియరింగ్ హౌస్ వివరాలన్నీ పరిశీలించిన అదే రోజున డబ్బు చెల్లించాల్సిన బ్యాంక్‌కు (డ్రాయీ బ్యాంక్‌) పంపుతుంది. డ్రాయీ బ్యాంక్‌కు చెక్కుల ఫొటోలు అందిన వెంటనే, వేగంగా స్పందించాల్సి ఉంటుంది. చెక్కుల నిర్ధారణ వ్యవధి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. ప్రతి చెక్కుకు ఒక నిర్దిష్ట గడువు సమయం (expiry time) ఉంటుంది. అందుకే, బ్యాంకులు వీటిని తక్షణమే (real-time) ప్రాసెస్ చేసి, సమాచారాన్ని క్లియరింగ్ హౌస్‌కు చేరవేయాల్సి ఉంటుంది.

Read Also- Apple Watch: సముద్ర గర్భంలో యువకుడు.. ఇంతలో ఊహించని సమస్య.. హీరోలా కాపాడిన యాపిల్ వాచ్!

ఆర్‌బీఐ ఎలా అమలు చేస్తుంది?

ఈ నూతన వ్యవస్థను ఆర్బీఐ రెండు దశల్లో అమలు చేయనుంది. మొదటి దశంలో భాగంగా 2025 అక్టోబర్ 4 నుంచి 2026 జనవరి 2 వరకు అన్ని చెక్కులకు నిర్ధారణ గడువు సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. అప్పటిలోగా బ్యాంకులు నిర్ధారణ చేయకపోతే, ఆ చెక్కును ఆటోమేటిక్‌గా క్లియరెన్స్ ఇచ్చినట్టుగా పరిగణించి సెటిల్ చేస్తారు. ఇక, రెండవ దశ 2026 జనవరి 3 నుంచి మొదలవుతుంది. బ్యాంకులు చెక్కును క్లియర్ చేయడానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, ఉదయం 10 నుంచి 11 మధ్య వచ్చిన చెక్కు అయితే, మధ్యాహ్నం 2 గంటలలోగా నిర్ధారణ ఇవ్వాలి. డ్రాయీ బ్యాంక్ 3 గంటల వ్యవధిలోగా నిర్ధారణ ఇవ్వకపోతే, ఆ చెక్కులు మధ్యాహ్నం 2 గంటలకు ఆటోమేటిక్‌గా క్లియరెన్స్ ఇచ్చినట్టు పరిగణిస్తారు. తద్వారా బ్యాంకులు మరింత వేగంగా చెక్కులను క్లియర్ చేయడానికి ప్రోత్సహిస్తుంది. దీంతో ఖాతాదారుడి అకౌంట్లో మూడు గంటల వ్యవధిలోనే డబ్బు జమ అవుతుంది. పేమెంట్ సెటిల్మెంట్ అయిన తరువాత, క్లియరింగ్ హౌస్ ఖాతాదారుడి బ్యాంక్‌కు (చెక్కును సమర్పించిన బ్యాంక్) ఆమోదం, లేదా తిరస్కరణకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. బ్యాంక్ సెటిల్మెంట్ పూర్తయిన ఒక గంటలోపు ఖాతాలో డబ్బు జమ చేస్తుంది.

Read Also- Jurel Army Salute: టెస్ట్ కెరీర్‌లో జురెల్ తొలి సెంచరీ.. సెల్యూట్ చేస్తూ ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..