Chandrababu Naidu (imagecredit:twitter)
అమరావతి, ఆంధ్రప్రదేశ్

Chandrababu Naidu: గుడ్ న్యూస్.. రేపే ఆటో డ్రైవర్ల అకౌంట్లలోకి రూ.15 వేలు

Chandrababu Naidu: ఆంద్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపుటి నుంచి ఆటోడ్రైవర్ల సేవ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నున్నట్లు ఎపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు వారి ఖాతాలో ప్రతీ సంవత్సరం రూ. 15,000 ఆర్థిక సహాయంను కూటమి ప్రభుత్వం అందించి వారి ఖాతాలో జమచేయనుందని తెలిపారు. అయితే మొదటి విడత డబ్బులు రేపే ఆటోడ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నట్ల కూటమి ప్రభుత్వం తెలిపింది.

ఆటొ డ్రైవర్లకు భరోసా..

రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం అమలులోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలోని మహిళలు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లొ ఉచిత ప్రయాణం కల్పించారు. దీని కారణంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఎఫెక్ట్ పడింది. మహిళలకు ఫ్రీబస్సు పెట్టడంవలన ఆటో డ్రైవర్లకు కొంత నష్టం జరగింది. దీంతో ఆటొ డ్రైవర్లకు భరోసా కల్పించడం కోసం కూటమి ప్రభుత్వ సంవత్సరానికి 15000 వేల రూపాయలు అందించి వారి అండగా నిలవడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. దీనికి గాను గత కొన్నిరోజుల క్రితం ఆటోడ్రైవర్లనుండి దరఖాస్తులను సైతం ప్రభుత్వ అందుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం 3 లక్షలకు పైగా ఆటోల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు తెలపారు. ఆటో డ్రైవర్ల సేవా పథకం అమలులోకి తేవాలని ప్రభుత్వం ఓ పక్క ఎర్పాట్లను పూర్తి చేస్తుంది. అయితే వీటంన్నింటిపై ప్రభుత్వం ముందుగా చర్చ జరిపి వీటికి ఆమొద ముద్ర వేయనున్నారు.

Also Read: Vilaya Thandavam: ‘విలయ తాండవం’ టైటిల్ పోస్టర్ అదిరింది

గతంలోను ఆటోకార్నికులకు..

ఆటో వృత్తిలో ఉన్న కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగు పరచడంకోసం ప్రభుత్వం ఈ నిర్నయం తీసుకుంది. విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంబించనున్నట్లు అక్కడి అధికారులు సమాచారం. అయితే కూటమి ప్రభుత్వం గతంలోను ఆటోకార్నికులకు ఈ పథకం ఇవ్వాలన్న ఆలోచన లేనప్పటికి త్వరిత గతిన ఈ నిర్నయం తీసుకోవడంతో ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు విజయవాడలో జరగబోయే సమావేశంలో ఈ పథకానికి బీజం పడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ రాష్ట్రనాయకుల సమక్షంలో ఈ పథకాన్ని రేపు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: KV Schools: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరో 4 కేంద్రీయ విద్యాలయాలు కేటాయింపు

Just In

01

Crime News: ఓ యువకుడు గంజాయి సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్..!

Vijayawada Airport Fire: గన్నవరం విమానశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు

CM Revanth Reddy: రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్..!

Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

Baby Sale Case: దారుణం.. చెల్లిని అమ్మవద్దు అని తల్లి కాళ్ల మీద పడి వేడుకున్న కూతుర్లు.. ఎక్కడంటే?