Covid-Variant
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

XFG variant: అమెరికాలో కరోనా కొత్త వేరియెంట్ విజృంభణ.. లక్షణాలు ఇవే

XFG variant: అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఎక్స్‌ఎఫ్‌జీ స్ట్రాటస్ (XFG variant) అనే కొవిడ్-19 కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. అమెరికా అంతటా ఈ కేసుల పెరుగుదల నమోదవుతోంది. మే నెల ప్రారంభంలో మొత్తం కేసుల్లో ఎక్స్ఎఫ్‌జీ కేసులు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవ్వగా, సెప్టెంబర్ 28 నాటికి ఏకంగా 85 శాతం కేసులకు ఈ వేరియంటే కారణమని సీడీసీ( సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) విడుదల చేసిన డేటా పేర్కొంది. కాగా, సెప్టెంబర్ 20న సీడీసీ విడుదల చేసిన డేటా ప్రకారం, 19 రాష్ట్రాల్లో కేసులో చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ జాబితాలో నెవాడా, ఉటా, కనెక్టికట్, డెలావేర్ వంటి రాష్ట్రాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో అతిగా, లేదా చాలా అతిగా తీవ్రస్థాయిలో వైరస్ వ్యాపిస్తోందని తెలిపింది. దేశవ్యాప్తంగా చూస్తే కేసుల పెరుగుదల స్థాయి మధ్యస్త స్థాయిలో ఉందని తెలిపింది.

బ్రిటన్‌లోనూ పెరుగుతున్న కేసులు

ఎక్స్ఎఫ్‌జీ వేరియెంట్ కేసులో ఒక్క అమెరికాలోనే కాదు, ఇంగ్లండ్‌లోనూ నమోదవుతున్నాయి. ప్రధానంగా ఎక్స్ఎఫ్‌జీ, ఎన్‌బీ.1.8.1 (నింబస్) కారణంగా కొవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. యూకే ప్రభుత్వ డేటా ప్రకారం, మొత్తం కేసుల్లో ఎక్స్ఎఫ్‌జీ.3 (XFG.3) వేరియెంట్ 35 శాతంగా, ఎక్స్ఎఫ్‌జీ వేరియెంట్ 28 శాతం, ఎన్‌బీ.1.8.1 వేరియెంట్ 11 శాతం, ఎక్స్‌ఎఫ్‌జీ.5 వేరియెంట్ 7 శాతం, ఎక్స్ఎఫ్‌జీ.3.4.1 7 వేరియెంట్ కారణంగా 7 శాతం కేసులు నమోదవుతాయి.

Read Also- Elon Musk: సంపద విషయంలో ఎలాన్ మస్క్ అరుదైన ఘనత.. ఈ భూమ్మీద తొలి వ్యక్తి ఆయనే

ఏమిటీ ఎక్స్ఎఫ్‌జీ వేరియంట్?

స్ట్రాస్ (ఎక్స్ఎఫ్‌‌జీ) వేరియెంట్ రెండు ఒమిక్రాన్ సబ్-వేరియంట్ల కలయికతో ఏర్పడుతుంది. 2025 జనవరిలో వాయవ్య ఆసియాలో తొలిసారి ఈ వేరియెంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్ కొంతవరకు వేగంగా వ్యాపించగలదని అంచనా వేశారు. మనుషుల రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే లక్షణం ఉండడంతో వేగంగా కేసులు పెరగొచ్చని చెబుతున్నారు. అయితే, ఈ వైరస్ కారణంగా తీవ్రమైనా అనారోగ్య సమస్యలు ఉండబోవని ఇప్పటివరకు నమోదైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌కి కూడా ఉపయోగపడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు చెబుతున్నాయి. వైరస్ సోకినా లక్షణాలు, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో దోహదపడుతుందని అంటున్నారు.

Read Also- Woman Found Alive: రెండేళ్లుగా వరకట్న వేధింపులు, హత్య కేసు.. ఇప్పుడు ఊహించని ట్విస్ట్

ఎక్స్ఎఫ్‌జీ వేరియెంట్ లక్షణాలు ఇవే

ఎక్స్ఎఫ్‌జీ వేరియంట్‌ సోకినవారిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, లేదా విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గొంతు వాయిస్ (hoarseness) మారిపోవడం ఈ వైరస్ ప్రత్యేక లక్షణమని, కొందరిలో ఇది ప్రత్యేకంగా కనిపిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఒక అలర్జీ మాదిరిగా అనిపిస్తుంది. అయితే, రుచి, వాసన కోల్పోయే లక్షణం తక్కువగా కనిపిస్తోంది.

Just In

01

Nani Sujeeth: ‘బ్లడీ రోమియో’.. ‘ఓజీ’ దర్శకుడి నెక్ట్స్ సినిమాకు క్లాప్ పడింది

Kiran Abbavaram: పెళ్లికి.. రైట్ ఏజ్, రైట్ టైమ్ ఎప్పుడని అడిగితే.. కిరణ్ ఏం చెప్పారో తెలుసా?

Sana Mir Controversy: కశ్మీర్‌పై పాక్ మాజీ మహిళా క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. చెలరేగిన దుమారం

Raju Gari Gadhi 4: ‘రాజుగారి గ‌ది 4’ అనౌన్స్‌మెంట్.. విడుదల ఎప్పుడో తెలుసా?

XFG variant: అమెరికాలో కరోనా కొత్త వేరియెంట్ విజృంభణ.. లక్షణాలు ఇవే