Shocking Video: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో వచ్చిన భూకంపం దాటికి పలువురు మృత్యువాత పడ్డారు. అయితే భూకంపానికి సంబంధించి.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించిన దృశ్యాలు నెట్టంట చక్కర్లు కొడుతున్నాయి.
అసలేం జరిగిందంటే?
ఫిలిప్పీన్స్ లోని సెబూ నగరంలో జరుగుతున్న మిస్ ఆసియా – పసిఫిక్ ఇంటర్నేషనల్ 2025 గాలా నైట్ (Miss Asia-Pacific International 2025 Gala Night ) కార్యక్రమం కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే అందులో మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ఆడిటోరియం అంతా ఊగిపోయింది. భయకంపితులైన మోడల్స్.. స్టేజీ మీద నుంచి తలో దిక్కు పరిగెత్తారు. మరికొందరు ఎటు వెళ్లాలో తెలియకే అక్కడే ఉండిపోయారు. కొద్ది సెకన్ల తర్వాత ప్రకంపనలు ఆగిపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
‘మోడల్స్ క్షేమంగా ఉన్నారు’
భారీ భూకంపం నేపథ్యంలో మోడల్స్ భద్రతపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై మిస్ ఏషియా పసిఫిక్ ఇంటర్నేషనల్ (MAPI) సంస్థ స్పందించింది. ‘సెబూలో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత మా ప్రతినిధులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. భూకంప సమయంలో తక్షణ చర్యలు తీసుకున్న రాడిసన్ బ్లూ సెబూకు కృతజ్ఞతలు’ అని పేర్కొంది. అయితే ఎంతో గ్లామరస్ గా ప్రారంభమైన ఆసియా పసిఫిక్ కాంపిటీషన్ ఈవెంట్.. ఒక్క భూకంపంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ లో విషాదఛాయలు అలుముకున్నందున పోటీలను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. పరిస్థితులు కుదుటపడ్డాక.. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని అభిమానులకు తెలియజేశారు.
View this post on Instagram
Also Read: Shocking News: అత్తను జుట్టు పట్టుకొని కొట్టిన కోడలు.. వద్దని వేడుకున్న మనవడు.. వీడియో వైరల్
60 మందికి పైగా మృతి
ఫిలిప్పిన్స్ లో మంగళవారం వచ్చిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో నమోదైంది. అధికారుల సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం సెబూ నుండి సుమారు 95 కిలోమీటర్ల దూరంలోని బోగో సిటీలో నమోదైంది. ఈ ప్రకృతి విపత్తలో 60 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ కొంతమంది మరిణించగా.. పలువురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
Also Read: Madhya Pradesh: శిశువును చెత్తలో పడేసి.. పైన బండరాయి పెట్టిన తల్లిదండ్రులు.. 72 గంటల తర్వాత..