Shocking News (Image Source: Twitter)
Viral

Shocking News: అత్తను జుట్టు పట్టుకొని కొట్టిన కోడలు.. వద్దని వేడుకున్న మనవడు.. వీడియో వైరల్

Shocking News: పంజాబ్ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన అత్తపై విచక్షణారహితంగా దాడి చేసింది. జుట్టుపట్టుకొని లాగుతూ ముఖంపై చెంపదెబ్బలు కొట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియోలో ఏముందంటే?

పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోను బాధితురాలి మనవడు షూట్ చేశాడు. హర్జీత్ కౌర్ అనే మహిళ తన అత్త గుర్బజన్ కౌర్ ను జుట్టు పట్టుకొని లాగడాన్ని వీడియోలో గమనించవచ్చు. అయితే మనవడు అలా చేయవద్దని తన అమ్మను వారించడం కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. బిడ్డ మాట విని.. అత్త జుట్టును కోడలు వదిలేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఆమె ముఖంపై దాడి చేయడం గమనార్హం.

ఆస్తి కోసం దాడి..

మరోవైపు కోడలిపై అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పేరిట ఉన్న ఆస్తులను తనకు రాసి ఇవ్వాలని పట్టుబడుతూ కోడలు దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు మనవడు సైతం తన అమ్మకు కాకుండా నానమ్మకు బాసటగా నిలిచాడు. తన తల్లి మద్యం తాగి తరుచూ నానమ్మను కొడుతోందని మనవడు చరత్వీర్ తెలిపాడు. కొన్ని సార్లు నాన్నతో కూడా గొడవపడిందని పేర్కొన్నాడు. మద్యం తాగడంతో పాటు డ్రగ్స్ కూడా తీసుకుంటోందని ఆరోపించాడు.

Also Read: Madhya Pradesh: శిశువును చెత్తలో పడేసి.. పైన బండరాయి పెట్టిన తల్లిదండ్రులు.. 72 గంటల తర్వాత..

అడ్డుకోకుండా వీడియో ఏంటీ?

నానమ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు తనను ప్రశ్నించారన మనవడు చరత్వీర్ తెలిపాడు. ‘నువ్వు దాడిని అడ్డుకోకుండా ఎందుకు వీడియో తీశావు?’ అని పోలీసులు నిలదీసినట్లు చెప్పాడు. అయితే తనకు సాక్ష్యం కావాలి కాబట్టే.. వీడియో తీశానని తెలియజేసినట్లు చెప్పాడు. మరోవైపు బాధిత అత్త మాట్లాడుతూ.. తనపై చాలా కాలంగా కోడలు దాడిచేస్తున్నట్లు చెప్పారు. వాటిని మనవడు తరచూ రికార్డ్ చేస్తున్నాడని తెలిపారు. కాగా, చరత్వీర్ పంచుకున్న మరో వీడియోలో హర్జీత్ తన భర్తను చెప్పుతో కొడుతున్న దృశ్యం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: IND vs WI First Test: తొలి టెస్టులో చెలరేగిన సిరాజ్.. పీకల్లోతూ కష్టాల్లో వెస్టిండీస్.. ఇక వార్ వన్ సైడేనా!

Just In

01

Shocking Video: ర్యాంప్ వాక్ చేస్తుండగా భూకంపం.. హడలిపోయిన మోడల్స్.. దెబ్బకు పరుగో పరుగు!

Varun Tej baby: మెగా వారసుడి పేరు ప్రకటించిన వరుణ్ తేజ్.. ఏంటంటే?

Crime News: బోరబండలో హత్య కలకలం.. భర్తను సుత్తితో అతి దారుణంగా చంపిన భార్య!

OTT Movie: డార్క్ కామెడీతో చెమట్లు పట్టించే సినిమా.. చూడాలంటే..

Shocking News: అత్తను జుట్టు పట్టుకొని కొట్టిన కోడలు.. వద్దని వేడుకున్న మనవడు.. వీడియో వైరల్