RV Karnan (imagecredit:swetcha)
హైదరాబాద్

RV Karnan: దుర్గం చెరువు పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశం!

RV Karnan: దుర్గం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) అధికారులను ఆదేశించారు. ధుర్గం చెరువును తెలంగాణలో ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసే విషయంపై అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులు, ఎస్‌ఎన్‌డీపీ(SNDP), లేక్స్ విభాగాలతో రహేజా ఐటీ పార్క్(IT Park) (హైదరాబాద్) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి కమిషనర్ బుధవారం దుర్గం చెరువును పరిశీలించి, చెరువు ప్రొటెక్షన్ పనులతో పాటు ప్రతిపాదిత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

సుందరీకరణ పనులకు నిధులు..

చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో పరిసర కాలనీలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు చెరువు నీటి మట్టాన్ని ఎఫ్ టీఎల్(FTL) కన్నా తక్కువగా ఉంచాలని లేక్స్ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. కమిషనర్ ప్రోత్సాహంతో రహేజా ఐటీ పార్క్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్ ) కింద దుర్గం చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులకు నిధులు సమకూర్చడానికి ముందుకొచ్చిందని వివరించారు. రెండు సంవత్సరాల పాటు చెరువును సంరక్షించడానికి ఆ సంస్థ బాధ్యత తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read: Kavitha: స్థానికంలో జాగృతి పోటీ?.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను సిద్ధం చేయాలనే యోచన

నీటిని శుభ్రపరిచే చర్యలు

ఇందులో భాగంగా చెరువు చుట్టూ కంచె ఏర్పాటు, నిరంతర నీటిని శుభ్రపరిచే చర్యలు, చెరువులో తేలియాడే వ్యర్థాలను తొలగించడం, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, ల్యాండ్‌స్కేపింగ్, పచ్చదనం ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యాలు కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎస్‌ఎన్‌డడీపీ, లేక్స్ విభాగాలను కూడా లేక్ ప్రొటెక్షన్, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ క్షేత్ర పరిశీలనలో కమిషనర్‌తో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్కడే హేమంత్‌ సహదేవ్‌ రావు, రహేజా గ్రూప్ నుండి బాలరాజు, జీహెచ్ఎంసీ(GHMC) ఇంజనీర్లునారు.

Also Read: Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..

Just In

01

Madhya Pradesh: శిశువును చెత్తలో పడేసి.. పైన బండరాయి పెట్టిన తల్లిదండ్రులు.. 72 గంటల తర్వాత..

MLA Kaushik Reddy: స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం కాయం: కౌశిక్ రెడ్డి

Pawan Kalyan weakness: తన వీక్‌నెస్ ఏంటో చెప్పిన పవన్ కళ్యాణ్.. అందుకేనా..

Kothagudem District: ఓబీ కంపెనీలో మహిళా కార్మికులకు రక్షణ కరువు.. పట్టించుకోని అధికారులు

Akhanda 2 release: బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘అఖండా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?