Krishna vamshi coments on Iliana
Cinema

Tollywood:ఇల్లీ కి ఇన్ సల్ట్

Creative Director Krishna Vamshi critised actress Iliana:

పోకిరి మూవీతో మహేష్ బాబు పక్కన నటించిన క్రేజీ బ్యూటీ ఇలియానా. దేవదాసు మూవీతో తెరంగేట్రం చేసిన ఈ గోవా బ్యూటీ అప్పట్లో బడా హీరోలందరితోనూ నటించింది. తర్వాత బాలీవుడ్ లోనూ తన లక్ ను పరీక్షించుకుంది. తెలుగులో ఈ బ్యూటీ చేసిన చివరి సినిమా అమర్, అక్బర్, ఆంటోనీ. రవితేజ ఈ మూవీలో హీరో. మరోసారి టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్థార్ట్ చేసే ఆలోచనలో ఉంది ఇలియానా. ఇక దర్శకుడు కృష్ణవంశీ సైతం ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. నిన్నే పెళ్లాడుతా, అంత:పురం, ఖడ్గం, గులాబీ వంటి సంచలన చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉండగా కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో ఇలియానాకి బాగా పొగరు అంటూ మాట్లాడిన కామెంట్స్ నెట్టింట దుమారం సృష్టిస్తోంది.

ఆమె యాటిట్యూట్ నచ్చదు

కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ మూవీలో ఎన్టీఆర్ సరసన ఇలియానా, ఛార్మి హీరోయిన్స్ గా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కృష్ణ వంశీ మాట్లాడుతూ.. చార్మి ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తుంది. కానీ ఆమెకు అన్నీ ఫ్లాప్సే వస్తున్నాయి. ఇక రాఖీ సినిమా సమయంలో ఇలియానా యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదు. అయితే ఈమెను నేను సినిమాలో తీసుకోవాలి అనుకోలేదు. కానీ అప్పట్లో ఆమెకు మంచి కమర్షియల్ సినిమాలు వచ్చి పడ్డాయి. దాంతో క్రేజ్ ఉన్న హీరోయిన్ కాబట్టి కొంత మంది బలవంతంగా హీరోయిన్ ని తీసుకొచ్చి సినిమాలో పెట్టారు.

అస్సలు పట్టించుకునేవాడిని కాదు

నాకు మాత్రం ఇలియానాను హీరోయిన్ గా పెట్టుకోవాలని లేదు. ఇక ఆ సినిమా చేసే సమయంలో నేను సినిమా షూటింగ్ లో జస్ట్ డైలాగ్స్ చెప్పేవాడిని కానీ ఆ తర్వాత ఆమెను అస్సలు పట్టించుకునే వాడిని కాదు..అంటూ కృష్ణ వంశీ చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా అయినాయి.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్