Viral Post (Image Source: Freepic)
Viral

Viral Post: రూ.14 లక్షల జీతంతో కొత్త జాబ్.. చేరిన తొమ్మిదో రోజే యువకుడు రిజైన్.. ఎందుకంటే?

Viral Post: ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఎంత కష్టంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ సరిపడ జాబ్ దొరక్క చాలా మంది యువత నిరాశతో జీవితాన్ని నెట్టుకొట్టుసున్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా రూ.14 లక్షల ప్యాకేజీతో జాబ్ సాధించాడు. తీరా 9 రోజులకే తాను ఆ జాబ్ చేయబోనంటూ రిజైన్ చేశారు. ఇందుకు గల కారణాలను తెలియజేస్తూ ఆ యువకుడు నెట్టింట పోస్ట్ పెట్టగా.. అది వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే..

యువకుడు తన సోషల్ మీడియా పోస్టులో కీలక విషయాలను వెల్లడించారు. తాను 4 నెలల పాటు నిరుద్యోగంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైన చివరి నిమిషంలో తిరస్కరణకు గురైనట్లు చెప్పాడు. చివరకూ 80 మంది ఉద్యోగులతో ఉన్న ఒక స్టార్టప్ కంపెనీలో తనకు జాబ్ వచ్చిందని స్పష్టం చేశాడు. నెలకు రూ.14 లక్షలు ఇస్తానని చెప్పడంతో చాలా సంతోషించినట్లు తెలిపాడు.

యూకే ఆఫర్ రావడంతో..

అయితే జాబ్ లో చేరిన తొమ్మిది రోజులకే తాను రిజైన్ చేసినట్లు యువకుడు షాకిచ్చాడు. ఇందుకు గల బలమైన కారణమేంటో కూడా సోషల్ మీడియా పోస్ట్ లో వివరించాడు. తనకు యూకేలోని ఓ అగ్రశ్రేణి మల్టీ నేషనల్ బ్యాంకులో జాబ్ ఆఫర్ వచ్చిందని తెలియజేశాడు. ఉద్యోగం రాకముందు దాదాపు తాను 30 వరకూ ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాయని.. ఈ క్రమంలో తాను ఎంతో ఒత్తిడికి లోనయ్యాయని చెప్పాడు. ఇప్పుడు తనకు మానసిక ప్రశాంతత కావాలని భావిస్తున్నట్లు చెప్పాడు. స్టార్టప్ కంపెనీలో పనిచేస్తూ మరింత ఒత్తిడి తీసుకునే కంటే యూకేకు వెళ్లి సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అక్కడ 5-7 ఏళ్ల పాటు ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. కాబట్టి కొత్తగా చేరినప్పటికీ జాబ్ కు రిజైన్ చేసినట్లు వివరించాడు.

Also Read: Kalvakuntla Kavitha: ఈటలపై కవిత ఫైర్.. బీజేపీకి ఆల్టిమేటం జారీ.. స్థానిక ఎన్నికల్లో పోటీపై క్లారిటీ

నెటిజన్ల స్పందనలు

అయితే మంచి ప్యాకేజ్ తో ఉన్నప్పటికీ జాబ్ వదులుకోవడంపై నెటిజన్లు స్పందించారు. కొందరు అతడికి మద్దతు తెలియజేస్తూ.. స్టార్టప్ కంటే ఎంఎన్‌సీ కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం నీ కెరీర్ కు మంచి బూస్టప్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరికొందరు స్టార్టప్ కంపెనీల్లో ఉండే వర్క్ ప్రెజర్ గురించి ప్రస్తావించారు. ఒక యూజర్ స్పందిస్తూ ‘నేను మూడు స్టార్టప్ కంపెనీల్లో పని చేశా. వర్క్ కల్చర్ చాలా దారుణంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. చాలా మంది అతడి కామెంట్ ను లైక్ చేయడం ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Also Read: Richest Indians: సంపన్నుల లిస్ట్ విడుదల.. బిలియనీర్ల జాబితాలోకి షారుఖ్‌.. ఎవరి ఆస్తి ఎంతంటే?

Just In

01

V Hanumantha Rao: బ‌తుక‌మ్మ‌కుంట నిర్వహణ బాధ్య‌త మీదే: VH హనుమంతారావు

Cough Syrup Deaths: దగ్గు సిరప్ తాగి ఆరుగురు చిన్నారుల మృతి.. తీవ్ర విషాదం

Ramchander Rao: ఆ రెండు పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు: రాంచందర్ రావు

Investment Scam: అధిక లాభాల ఆశ చూపి కోట్లు దోచేస్తున్న ముఠా అరెస్ట్ .. ఎక్కడంటే?

MLC Kavitha: ఈటల రాజేందర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు!.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!