High Speed Rail: రవాణా రంగంలో అతి పెద్ద మార్పునకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా అత్యాధునిక హై-స్పీడ్ రైలు ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అబుదాబిలో జరిగిన గ్లోబల్ రైల్ కాన్ఫరెన్స్ లో యూఏఐ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రైల్వే సంస్థ ఎతిహాద్ రైల్ (Etihad Rail) తమ హై-స్పీడ్ ట్రైన్ తుది డిజైన్‌ను ప్రకటించింది. 2026 నుంచి ఈ హై స్పీడ్ రైలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఇది గరిష్టంగా 200 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్నట్లు స్పష్టం చేసింది.
11 నగరాలను కనెక్ట్ చేస్తూ..
యూఏఈలోని 11 ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తూ ఈ హైస్పీడ్ రైలు పరుగులు పెట్టనున్నట్లు ఎతిహాద్ రైల్ వెల్లడించింది. ఇది అందుబాటులోకి వస్తే అబుదాబి – దుబాయ్ మధ్య ప్రయాణం ఏకంగా 57 నిమిషాలకు తగ్గిపోతుందని అంచనా వేసింది. అలాగే అబుదాబి నుంచి రువైస్ (70 నిమిషాలు), ఫుజైరా (100 నిమిషాలు) నగరాలకు సైతం వేగంగా చేరుకోవచ్చని తెలిపింది. ఈ హైస్పీడ్ రైళ్లు రెండు డిఫరెంట్ నెటవర్క్స్ తో పరుగులు పెట్టనున్నట్లు ఎతిహాద్ రైల్ ప్రతినిధులు తెలిపారు. చైనా సీఆర్‌సీ కేబిన్లతో రూపొందిన రైలు 365 సీట్లతో.. స్పెయిన్ సీఏఎఫ్ కేబిన్లతో ఉన్న రైలు 369 సీట్లతో నడుస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే 50 ఏళ్లలో యూఏఈ డీజీపీకి.. AED 145 బిలియన్స్ జత కానున్నట్లు తెలిపింది.
Etihad Rail announces new high-speed train; travel from Dubai to Abu Dhabi in 30 mins….https://t.co/ZYfQ8gSyPP pic.twitter.com/dJ9p5a5zgq
— Daily Times UAE (@dailytimes_ae) January 24, 2025
గ్లోబల్ రైల్ – 2025 ఎగ్జిబిషన్
అబుదాబిలోని ఏడీఎన్ఈసీ (ADNEC) సెంటర్‌లో ప్రారంభమైన గ్లోబల్ రైల్ – 2025 ఎగ్జిబిషన్ ప్రదర్శన మంగళవారం (అక్టోబర్ 2) వరకూ కొనసాగనుంది. ‘డ్రైవింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ గ్లోబల్ కనెక్టివిటీ’ (Driving the Future of Transport and Global Connectivity) అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు 20 కంటే ఎక్కువ దేశాల మంత్రివర్గ ప్రతినిధులు, ప్రభుత్వ – ప్రైవేట్ రంగ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
మూడు డిఫరెంట్ కోచ్ లు
ఎతిహాద్ రైల్ సంస్థ ప్రకటించిన హై స్పీడ్ రైళ్లు.. మూడు కోచ్ లతో అందుబాటులోకి రానుంది. ఎకానమీ క్లాస్, ఫ్యామిలీ క్లాస్, ఫస్ట్ క్లాస్ తరగతుల్లో ప్రయాణికులు ట్రావెల్ చేయవచ్చు. రైలులోని ఎకానమీ క్లాస్.. రోజువారీ ప్రయాణికుల కోసం డార్క్ గ్రే కలర్‌లో కాంపాక్ట్, బ్యాక్-టు-బ్యాక్ సీటింగ్ అరేంజ్ మెంట్స్ ను కలిగి ఉండనుంది. ఫ్యామిలీ క్లాస్ తరగతిలో ఎదురెదురుగా కూర్చోడానికి వీలు ఉంటుంది. అలాగే మధ్యలో టేబుల్ ను ఏర్పాటు చేస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రయాణించడానికి ఫ్యామిలీ క్లాస్ అనుకూలంగా ఉండనుంది. ఇక ఫస్ట్ క్లాస్ తరగతి వస్తే అందులో విశాలమైన, సర్దుబాటుకు చేసుకునేందుకు వీలుపడే సీట్లు ఉండనున్నాయి. ఈ కోచ్.. అధునాతన సౌకర్యాలతో ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది.
Also Read: US Shutdown: షట్ డౌన్‌లోకి అమెరికా.. ఆగిపోయిన ప్రభుత్వ సేవలు.. 6 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్
లగేజీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
హై స్పీడ్ రైలులోని అన్ని కోచ్ లలో మడత పెట్టుకునే టేబుళ్లు, ఓవర్ హెడ్ స్టోరేజ్, పెద్ద లగేజీల కోసం ప్రత్యేక స్టోరేజ్ స్పేస్ ఉండనున్నాయి. ప్రయాణికులు ఆటోమేటిక్ టికెట్ గేట్ల ద్వారా రైల్వే స్టేషన్లలోకి ప్రవేశిస్తారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే స్టేషన్లలో టికెట్ వెండింగ్ మెషీన్లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రోటోటైప్ టికెట్ మెషీన్ బ్లాక్-గ్రే కలర్‌లో ఉండనుంది. ఇది నగదు తో పాటు డెబిట్, క్రెడిట్ కార్డ్స్, ఆపిల్ పే ద్వారా చెల్లింపులను స్వీకరిస్తుంది.