RV Karna ( image credit; swetcha reporter)
హైదరాబాద్

RV Karnan: ఉద్యోగులసేవలు మరువలేనివి.. కర్ణన్ కీలక వ్యాఖ్యలు

RV Karnan: గ్రేటర్ వాసులకు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలు మరువలేనివని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ (RV Karnan) ప్రశంసించారు.  సాయంత్రం జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో రిటైర్డు ఉద్యోగులకు సత్కార సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కమిషనర్ రిటైర్డు అవుతున్నవివిధ స్థాయిలోని 19 మంది అధికారులు, ఉద్యోగులను శాలువా , పూల దండలతో సత్కరించి, గిఫ్ట్ లను బహుకరించారు.

 Also Read: Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’కు టికెట్ రేట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఎంత పెంచారంటే..?

పదవీ విరమణ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం

ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ (RV Karnan) మాట్లాడుతూ పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. పదవీ విరమణ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం లాంటిదని, రిటైర్డు అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తి, అభురుచిలకు ప్రాధాన్యమిస్తూ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. వారి మున్ముందు జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, అదనపు కమిషనర్ కే.వేణుగోపాల్ ,పీఆర్ఓ మామిండ్ల దశరథం, ఏఎంసీ శారద తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన సాత్విక్ నాయక్ కు సత్కారం

జీహెచ్ఎంసీ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన సాత్విక్ నాయక్ కు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో అదనపు కమిషనర్ కే వేణుగోపాల్, అధికారులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. సాత్విక్ నాయక్ ప్రస్థానం స్ఫూర్తిదాయకమని అదనపు కమిషనర్ వ్యాఖ్యానించారు.

Also Read: Medak District: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌.. మెదక్‌లో రాజుకున్న రాజకీయ వేడి!

Just In

01

Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Bank Holidays 2025: బిగ్ అలెర్ట్.. అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఈ తేదీల్లో అస్సలు వెళ్లొద్దు!

Khammam: ఖమ్మం జిల్లాలో శ్రీ కోటమైసమ్మ తల్లి అతి పెద్ద జాతర.. ఈ విశిష్టత కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయాతిపై కేసు నమోదు.. మరీ అంత దారుణమా..

Viral Video: రైల్వే స్టేషన్స్‌లో నీళ్లు తాగుతున్నారా? ఇది చూస్తే ఎప్పటికీ ఆ ధైర్యం చేయరు!