Gadwal District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Gadwal District: దేవుని భూమిపై రియల్ ఎస్టేట్ కబ్జాదారుల కన్ను.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి వినతి!

Gadwal District: ధరూర్ మండలంలోని నీలహళ్లి గ్రామంలో రాజకీయ నాయకుల అండదండలతో శ్రీ ఆంజనేయస్వామి దేవస్థాన ఇనాం భూమి ఆక్రమణకు గురైందని, వెంటనే కబ్జాకు గురైన భూమిని కాపాడాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మంగళవారం గ్రామస్థులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గ్రామంలో 335 సర్వే నెంబ ర్ లోని 5ఎకరాల 16గుంటల ఇనాం భూమిని గ్రామంలో ఉన్న ఇరువర్గాల రాజకీయ పార్టీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తూ కబ్జాకు పాల్పడటమే కాగా గ్రామస్థులను నయవంచనకు గురిచేస్తూ అన్యాయానికి ఒడిగట్టారని తెలిపారు. ఎవరైతే ఆంజనేయస్వామి దేవస్థానానికి పూజారిగా సేవ చేస్తారో, వారు ఈ భూమిలో ఉపాధికి వ్యవసాయం చేసుకునే అవకాశం ఉందన్నారు. గత 25 సంవత్సరాలకు పైగా ఈ భూమిపైకి ఎవరూ రాలేదని, ఇదే తరుణంలో రాజకీయ నాయకులు ఏకమై కుట్రకు పాల్పడి ఇనాం భూమిలో రాత్రికిరాత్రే కంప పొదలను తొలగించి చదును చేసి ఆక్రమణకు పాల్పడ్డారని తెలిపారు.

Also Read: Surya Vs Pak Reporter: సూర్య టార్గెట్‌గా పాక్ రిపోర్టర్ ప్రశ్న.. మనోడి సమాధానానికి సైలెంట్

ఇనాం భూమిని దత్తపుత్రుడిగా..

ఇనాం భూమి కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కొంతమంది భూ కబ్జాదారులు సంబంధంలేని కిష్టాచారి(Kishtachari) అనే వ్యక్తిపై గ్రామానికి సంబంధించి ఇనాం భూమిని దత్తపుత్రుడిగా చిత్రీకరించి కొత్త నాటకానికి తెరతీస్తూ భూ కబ్జాదారులు కిష్టాచారిపై రిజిస్ట్రేషన్ చేయడం అన్యాయమని అన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకొని ఆలయ భూమిని కాపాడాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల నాయకులు మునెప్ప, మీసాల కిస్టన్న, భూపతి నాయుడు,ఉరుకుందు, గువ్వల వీరష్ కృష్ణ, వీరితో పాటు గ్రామస్తులు జగదీష్, పెద్ద ఇస్మాయిల్, రేలంగి, మని, గూప హనుమంతు, బోయ నర్సింహులు, చిలుక మునెప్ప, బంగారు మల్లేష్, బోయ వీరెష్, తదితరులు పాల్గొన్నారు.

Also Read: Crime News: కొడుక్కి 18 ఏళ్లు నిండడానికి ఒక్క రోజు ముందు.. తండ్రి పక్కా ప్లాన్

Just In

01

Paddy Harvest Delay: ఇనుగుర్తి మండలంలో రైతుల ఇక్కట్లు.. ప్రారంభం కాని వరి కోతలు..!

Delhi Blast Probe: బాంబు పేలుడుకు ముందు ఉమర్ ఎక్కడ నివసించాడో కనిపెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు

Shiva Re-Release: నాగార్జున ‘శివ’ రెండు రోజుల గ్రాస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రీ రిలీజ్‌కు ఇంత క్రేజా..

Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం 123 కోట్లు: మంత్రి వాకిటి శ్రీహరి

Kolkata Test: కోల్‌కతా టెస్టులో భారత్ ఓటమి.. దక్షిణాఫ్రికా ఉత్కంఠభరిత విజయం