Tilak Varma: ఆసియా కప్ – 2025 ఫైనల్స్ లో పాక్ పై టీమిండియా గెలవడంలో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ క్రీజులో పాతుకుపోయి.. భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఈ యంగ్ బ్యాటర్ కు ఎవరూ ఊహించిన స్థాయిలో స్పందన లభిస్తోంది.
‘దేశాన్ని గెలిపించాలనే ఆడా’
మంగళవారం హైదరాబాద్ శేరిలింగంపల్లిలో తాను ఒకప్పుడు శిక్షణ పొందిన లెగాల క్రికెట్ అకాడమీ (Legala Cricket Academy)ని తిలక్ సందర్శించారు. దీంతో అతడ్ని చూసేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు అక్కడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తిలక్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇండియాను గెలిపించడమే టార్గెట్‌గా పెట్టుకుని పాక్‌పై ఆడినట్లు చెప్పాడు. మ్యాచ్‌ను గెలిపించి తీరాలనే పట్టుదలతో చివరి వరకూ క్రీజులో నిలదొక్కుకున్నట్లు పేర్కొన్నారు.
‘కోహ్లీతో పోల్చడం గర్వంగా ఉంది’
తనను చాలా మంది విరాట్ కోహ్లీతో పోల్చడం పట్ల తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. విరాట్ తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాడని.. అతడితో తనను పోల్చడం గర్వంగా ఉందని చెప్పాడు. ‘ఆసియాకప్ ఫైనల్‌లో గెలవడం ఆనందంగా ఉంది. పాక్ తో ఆడుతున్నంత సేపు మా కళ్ల ముందు దేశమే కనిపించింది. దేశమంతా నా ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తేస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఫైనల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నా. నేను బ్యాటింగ్ చేసే ముందు గట్టిగా ఊపిరి తీసుకొని ప్రశాంతంగా ఆడేందుకు ప్రయత్నించా. ఒత్తిడికి గురికావొద్దని డ్రెస్సింగ్ రూమ్ లోనే అనుకున్నా’ అని అన్నాడు.
Also Read: VC Sajjanar: హైదరాబాద్ సీపీగా సజ్జనార్ ఫస్ట్ ప్రెస్ మీట్.. క్రిమినల్స్‌కు మాస్ వార్నింగ్
‘పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టారు’
ఆసియా కప్ ఫైనల్స్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తిలక్ వర్మ తెలిపాడు. అయినప్పటికీ అన్ని అబ్జర్వ్ చేస్తూ ప్రశాంతంగా ఆడినట్లు చెప్పాడు. ‘మ్యాచ్ ఫినిష్ చేస్తానని కాన్ఫిడెంట్ గా ఉన్నా. క్రికెట్ ను ఎమోషనల్ గా తీసుకోవద్దు. ఈ విజయం భారత్ జవాన్లకు అంకితం. మెుదటిలోనే మూడు కీలక వికెట్లు పడడంతో క్రీజులో జాగ్రత్తగా ఉన్నాను. ఆసియా కప్పు గెలడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే వరల్డ్ కప్ లో ఆడటమే నా లక్ష్యం. నేను ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్లో ప్రెస్ మీట్ పెట్టడం ఆనందంగా ఉంది. నా కోచ్ కి నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు’ అని తిలక్ చెప్పుకొచ్చాడు.
దేశాన్ని గెలిపించాలనే ఉద్దేశంతోనే ఆడాను: తిలక్ వర్మ
పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఒత్తిడికి గురయ్యాం
ఆ సమయంలో ఎమోషనల్ అయితే ఆటను ఆడలేం
దేశాన్ని తలుచుకుని స్థిరంగా ఆలోచించి, బాగా ఆడేందుకు ప్రయత్నించా
– తిలక్ వర్మ https://t.co/dKQXX7sdQg pic.twitter.com/9N7FMj1XDa
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2025