Uttam Kumar Reddy: రాష్ట్రంలో సాగునీటి చెరువులు,కుంటలు,కాలువల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానుసారం సాగునీటి సంఘాల ఏర్పాటు పై సమాలోచనలు జరుపుతున్నట్లు వెల్లడించారు. చెరువులు,కుంటలు, కాలువల భద్రత కోసం అన్ని విధాలుగా అధ్యయనం చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్ట పోవొద్దు అన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. వర్షాలతో చెరువులు,కుంటలకు గండ్లు పడడం,కాలువలు తెగి పోవడం వంటి అంశాలతో పాటు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడం,సీతారామ, చనకా-కొరటా,సీతమ్మ సాగర్,మోడీకుంట వాగు అనుమతులతో పాటు ఎస్.ఎల్.బీసీ పనుల పునరుద్ధరణ పై సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం సాగునీటి సంఘాల ఏర్పాటు ఉండేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.
Also Read: Harish Rao: గురుకులలో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోవడం అన్యాయం.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
చెరువులు,కుంటలు, కాలువలకు భద్రత కలిపించే చర్యలు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న సాగునీటి చెరువుల పరిరక్షణ నిమిత్తం సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసిన పక్షంలో క్రమ క్రమంగా భారీ నీటి తరహా ప్రాజెక్టులకు విస్తరించేందుకు దోహద పడుతుందన్నారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో సాగునీటి నిర్వహణ తో పాటు, చెరువులు,కుంటలు, కాలువలకు భద్రత కలిపించే చర్యలు సాగునీటి సంఘాలకు బాధ్యత ఉండేలా చర్యలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం కోసం తెలంగాణా అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫెర్ కమిషన్ చైర్మన్ యం.కోదండ రెడ్డి ,కమిషన్ సభ్యుల సమన్వయం తో సాగునీటి సంఘాలను నామినేట్ చేసే విదంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.
సుప్రీంకోర్టులో చట్టపరమైన పోరాటానికి సిద్ధం కావాలి
కర్ణాటక రాష్ట్రం ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకోర్టులో చట్టపరమైన పోరాటానికి సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు పెండింగ్ లో ఉన్న సీతారామ,చనకా-కొరటా,సీతమ్మ సాగర్,మోడీకుంట వాగు వంటి ప్రాజెక్టుల అనుమతులను త్వరితగతిన తీసుకునేలా పనులు వేగవంతంచేయాలని సూచించారు.తమ్మిడిహట్టి వద్ద నిర్మించ తల పెట్టిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టుకు సంబందించిన డీపీఆర్ లను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మంత్రివర్గ ఆమోదం పొందిన మీదట ఎస్.ఎల్.బీసీ పనుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. చిన్న కాళేశ్వరం, కల్వకుర్తి,దేవాదుల ప్యాకేజి-6తదితర ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలు మంత్రివర్గ ఆమోదం తీసుకోబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
నేడు ఢిల్లీకి మంత్రి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలువనున్నట్లు వెల్లడించారు. ఈసారి 80లక్షల మెట్రిక్ టన్నుల పంట ప్రొక్యూర్ చేయనున్నట్లు తెలిపారు. 52లక్షల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ కే కేంద్రం అనుమతి ఇచ్చిందని, మిగిలిన ధాన్యం ప్రొక్యూర్ మెంట్ కు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తానన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాముల్లో, రైస్ మిల్లులో ధాన్యం నిండిపోయి ఉందన్నారు. ధాన్యం తలింపుకు 300ట్రైన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తానన్నారు.
Also Read: Indiramma Canteens: హైదరాబాదీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేవలం రూ.5కే వెరైటీ టిఫిన్స్, భోజనం