NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పథకం గురించి తెలుసా
ntr bharosa ( Imge Source: Twitter)
Viral News, ఆంధ్రప్రదేశ్

NTR Bharosa Pension: ఎన్టీఆర్ భరోసా పథకం గురించి తెలుసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం’ను అమలు చేస్తోంది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలవారీ ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద లబ్ధిదారులకు నెలకు రూ. 500 నుంచి రూ. 15,000 వరకు పింఛన్‌ను నేరుగా వారి ఇంటి వద్దకే చేరవేస్తున్నారు.

ఎన్టీఆర్ భరోసా పథకం

ఈ పథకం ద్వారా పేదలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పింఛన్ పంపిణీ చేస్తారు. పబ్లిక్ హాలిడే వచ్చినప్పుడు నెలాఖరు (30 లేదా 31వ తేదీ) నుంచే పంపిణీ మొదలవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పథకం విజయవంతానికి కృషి చేస్తున్నారు.

Also Read: Kishan Reddy: మేము ఏ పార్టీలో కలవబోం.. ఒంటరిగానే మా భవిష్యత్ ప్రయాణం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పథకం లక్ష్యాలు

1. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఆర్థిక భరోసా కల్పించడం.
2. వారిని ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడం.
3. సమాజంలో గౌరవప్రదమైన జీవనాన్ని అందించడం, నిర్లక్ష్యాన్ని నివారించడం.

Also Read: Ram Charan: చేతులపై కిరోసిన్ పోసుకుని మ్యూజిక్ కొట్టావా థమన్.. ‘ఓజీ’ మ్యూజిక్‌పై చరణ్ రియాక్షన్

పథకం కింద 14 రకాల పింఛన్లు

గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ఈ పథకంలో ఈ కింది వర్గాలకు పింఛన్లు అందిస్తున్నారు

1. వృద్ధాప్యం: రూ. 4,000/నెల
2. వితంతువు: రూ. 4,000/నెల అందివ్వనున్నారు.
3. ఒంటరి మహిళ: రూ. 4,000/నెల అందివ్వనున్నారు.
4. సాంప్రదాయ చర్మకారులు: రూ. 4,000/నెల అందివ్వనున్నారు.
5. కల్లు/గీత కార్మికులు: రూ. 4,000/నెల అందివ్వనున్నారు.
6. మత్స్యకారులు: రూ. 4,000/నెల అందివ్వనున్నారు.
7. నేత కార్మికులు: రూ. 4,000/నెల అందివ్వనున్నారు.

Also Read: Radial Road Project: ఆ 14 గ్రామాల మీదగా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు.. నిర్మణ పనులకు నేడు సీఎం శంకుస్థాపన

8. ART (యాంటీ రెట్రోవైరల్ థెరపీ): రూ. 4,000/నెల
9. వికలాంగులు: రూ. 6,000 లేదా రూ. 15,000/నెల (అవసరాన్ని బట్టి) అందివ్వనున్నారు.
10. ట్రాన్స్‌జెండర్: రూ. 4,000/నెల అందివ్వనున్నారు.
11. డప్పు కళాకారులు: రూ. 4,000/నెల అందివ్వనున్నారు.
12. CKDU (దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి): రూ. 10,000/నెల అందివ్వనున్నారు.
13. సైనిక్ సంక్షేమం: రూ. 5,000/నెల
14. అమరావతి భూమిలేని పేదలు/అభయహస్తం: రూ. 5,000/నెల, రూ. 500/నెల అందివ్వనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ

లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పథకం కోసం అధికారిక వెబ్‌సైట్ https://ntrbharosa.ap.gov.in నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫారమ్‌ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లతో సమీప గ్రామ సచివాలయంలో సమర్పించాలి. వాలంటీర్లు అర్హతను పరిశీలించి, ఆమోదం తర్వాత పింఛన్ అందిస్తారు.

Just In

01

Deputy CM Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. టీటీడీ వసతి గృహాలకు శంకుస్థాపన

Bus Accident: ఖమ్మంలో స్కూల్ బస్సు బోల్తా.. ప్రమాదంలో మంది 20కి విద్యార్థులు గాయలు

Thalaivar 173: రజనీకాంత్ ‘తలైవార్ 173’ కి దర్శకుడు ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Bandi Sanjay: అబద్ధాల పోటీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కే అవార్డులు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!