Kishan Reddy: ఎవరికి పడితే వారికి, ఏది నోటికొస్తే అది మాట్లాడే వారికి సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా లేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అమీర్ పేట్ నాగార్జున నగర్ కమ్యూనిటీ హల్ లో ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం దివ్యాంగులకు కిషన్ రెడ్డి పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు రైడ్స్ నిర్వహిస్తుంటాయని, అవి ఎక్కడ నిర్వహించాలి? ఎవరిపై దాడి చేయాలనేది ఆ సంస్థ బాధ్యత అని చెప్పారు. వారికి, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవగాహన లేకుండా మాట్లాడడం దురదృష్టకరమని చురకలంటించారు.
Also Read: Jr NTR: అమ్మమ్మ చెప్పిన కథలు.. తెరపై చూశాక మాటలు రాలేదు
హరీష్ రావు ఏం న్యాయం చేశారు
గతంలో ఏ పార్టీ ఎవరితో కలిసిందనే ప్రశ్నకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. ఎందుకంటే ఎవరితో ఎవరు కలిసి మంత్రి పదవులు అనుభవించారో వారికే తెలుసన్నారు. హరీష్ రావు రాష్ట్రంలో మంత్రి పదవి వెలగబెట్టి ఏం న్యాయం చేశారని ఫైరయ్యారు. బీజేపీకి ఏ పార్టీతో కలిసిన చరిత్ర లేదని, భవిష్యత్తులో కూడా ఉండబోదన్నారు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నా, బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని కేటీఆర్ మాట్లాడుతున్నారంటే తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రాబోతోందనే భయం వారి మాటల ద్వారా అర్థమవుతోందని చురకలంటించారు. తాము ఎవరితో కలవబోమని, ఒంటరిగానే తమ భవిష్యత్ ప్రయాణం ఉంటుందన్నారు.
Also Read: The Raja Saab Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ట్రైలర్ విడుదల తేదీ ప్రకటించిన నిర్మాతలు..