Kantara Chapter 1 Pre Release Event
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: అమ్మమ్మ చెప్పిన కథలు.. తెరపై చూశాక మాటలు రాలేదు

Jr NTR: చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పిన కథలు.. తెరపై చూసి మాటలు రాలేదని అన్నారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR). రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ, ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1). ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇటీవల ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకోవడంతో పాటు, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో ఆదివారం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

Also Read- Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?

నాకు మాటలు రాలేదు

‘‘మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు కొన్ని కథలు చెబుతుండేది. అప్పుడు ఆమె చెప్పిన కథలు నిజంగా జరుగుతాయా? అసలు ఈ కథలు నిజమేనా? అని అనిపించేది. చాలా డౌట్స్ ఉండేవి. కానీ, ఆ కథలు నాకు బాగా నచ్చేవి. అమ్మమ్మ చెప్పిన కథలతో వాటిపై నాకు ఇంట్రెస్ట్ వచ్చేది. ఆ పింజుల్లి, గుడి ఘాట్ చిన్నప్పుడు నుంచి నా మదిలో నాటుకు పోయాయి. కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు.. చిన్నప్పుడు నేను విన్న ఆ కథలను ఒక దర్శకుడు తెరమీదకు తీసుకువస్తాడని ఊహించలేదు. ఆ దర్శకుడు మరెవరో కాదు, నా బ్రదర్ రిషబ్ శెట్టి. నేను చిన్నప్పుడు విన్న కథలను తెరపై చూసినప్పుడు.. నిజంగా నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే అంతగా ఆశ్చర్యపోతే.. ఆ కథ తెలియని వాళ్ళు చూసి ఏమయ్యారో అదే ‘కాంతార’ రిజల్ట్. రిషబ్ చాలా అరుదైన దర్శకుడు. 24 క్రాఫ్ట్‌లో ఆయన అన్ని క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు. రిషబ్ లేకపోతే నిజంగా ఈ సినిమాను ఈ స్థాయిలో తీయగలిగేవారా? అని అనిపిస్తుంది.

Also Read- Puri Jagannadh: తమిళనాడులో తొక్కిసలాట.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ సంచలన నిర్ణయం

రిషబ్ శెట్టి డ్రీమ్ ఇది

ఉడిపి కృష్ణుడు గుడికి వెళ్లాలనేది ఎప్పటి నుంచో మా అమ్మ కోరిక. రిషబ్ లేకపోతే అంత గొప్పగా దర్శనం అయ్యేది కాదు. అంతటి భాగ్యం కలిగేది కాదు. తను పనులన్నీ మానుకొని కుటుంబ సభ్యుల్లా మాతో వచ్చారు. మమ్మల్ని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ‘కాంతార చాప్టర్ 1’ కోసం రిషబ్ ఎంత కష్టపడుతున్నారో చూసే అవకాశం దొరికింది. ఈ సినిమా తీయడం అంత ఈజీ కాదు. మేము అక్కడ ఒక గుడికి వెళ్లాం. అసలు ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు. అలాంటి మార్గాన్ని ఈ సినిమా కోసం క్రియేట్ చేశారు. ‘కాంతార’ రిషబ్ శెట్టి డ్రీమ్. ఈ డ్రీమ్‌ని ఫుల్ ఫిల్ చేయడానికి హోంబలే ఫిల్మ్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఇండియన్ ఫిలిమ్స్‌లో ఒక గొప్ప బ్లాక్ బాస్టర్ చిత్రంగా ఈ సినిమా నిలబడాలని మనస్పూర్తిగా ఆ దేవున్ని కోరుకుంటున్నాను. ఈ స్టేజ్‌పై ప్రశాంత్ వర్మ కూడా ఉండాలి. కానీ తను రాలేదు. ఇక్కడికి వచ్చిన రిషబ్ అండ్ టీమ్‌ను, సినిమాను ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరుతున్నాను. ఈ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. అక్టోబర్ 2న అందరూ తప్పకుండా థియేటర్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

CM Revanth Reddy: దేశానికే ఆదర్శంగా నిలవనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Janagama: మూడు సీట్లు..! ఆరు నోట్లు..! స్థానిక ఎన్నిక‌ల‌పై బెట్టింగ్‌ల జోరు

Bathukamma Kunta: బతుకమ్మకుంట ప్రారంభం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Telangana Education: విద్యార్థులకు ల్యాబ్ మ్యాన్యుయల్స్.. ప్రతి క్లాసుకు 2 కాపీల చొప్పున పంపిణీ