Drussyam actor Jayachandran
Cinema, క్రైమ్

Cinema:విలువలు అ‘దృశ్యం ’

Drushyam malayalam actor kutikal jayachandran raped 4 years child:
ప్రపంచంలో రోజురోజుకూ అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ముక్కుపచ్చలారని పసిపాపలనుంచి పండు ముదుసలి దాకా ఎవరినీ వదలడం లేదు దుర్మార్గులు. మరికొందరు అభంశుభం ఎరుగని పసిమనసులపై మాయని మచ్చ వేస్తున్నారు. వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. పైగా నిర్ధాక్షిణంగా వారిని చంపేస్తున్నారు. అయితే మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా కామాంధులు వాటిని పట్టించుకోవడం లేదు. ఈ కోవలోకే చేరారు ఓ నటుడు. ఏకంగా అభం,శుభం తెలియని ఓ నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రియల్ లైఫ్ లోనూ విలనే

వివరాల్లోకి వెల్లితే.. దృశ్యం నటుడు, విలన్ పాత్రల్లో నటించిన మళయాల యాక్టర్ కూటికల్ జయచంద్రన్ నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిపాడని, బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మళయాల మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన తమ చిన్నారి, చాలా సేపటి తర్వాత ఇంటికి వచ్చిందని, తాను చాలా బలహీనంగా, నీరసంగా ఉండటమే కాకుండా, చిరిగిపోయిన దుస్తులు, శరీరం దుమ్ముతో ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. తర్వాత ఎంక్వైరీ చేయగా పాపపై లైంగిక దాడి జరిగినట్లు తెలిసింది. దీంతో వారు కోజికోడ్ పోలీస్టేషన్‌లో ఫిర్యాధు చేయడంతో, పోలీసులు కూటికల్ జయచంద్రన్ పై ఫోక్సో కేసు నమోదు చేశారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు వారి చిన్నారి నుంచి వాగ్మూలం తీసుకొని, కేసు నమోదు చేసి, నటుడిని అరెస్ట్ చేశారంటూ మలయాళం మీడియా కోడైకూస్తోంది. అయితే ఆయన సన్నిహిత వర్గాలు మాత్రం నటుడిని ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్తున్నాయి. ఏదీ ఏమైనప్పటికీ ఓ నటడు, ఇలాంటి దారుణమైన పనికి ఒడిగట్టడంతో ఆయన్ను కఠినంగా శిక్షించాలంటూ వారు కోరుతున్నారు. చీ వీడు మనిషేనా.. ప్రభుత్వం ఇతనిపై తగు చర్యలు తీసుకోవాలని వారు తెలుపుతున్నారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ