Aadhaar Card: ఆధార్ సేవలకు కొత్త ఛార్జీలు అమలులోకి రానున్నాయి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ సేవలకు సంబంధించి కొత్త ఛార్జీలను ప్రకటించింది. కొత్త ఆధార్ కార్డు జారీ, 5-7 ఏళ్ల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్, 15-17 ఏళ్ల వారి బయోమెట్రిక్ అప్డేట్‌లు ఉచితంగానే కొనసాగుతాయి. అయితే, చిరునామా మార్పు, బయోమెట్రిక్ అప్డేట్, పేరు మార్పు, ఫోన్ నంబర్ మార్పు వంటి సేవలకు అక్టోబర్ 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి. కొత్త ఛార్జీల వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Hyderabad Crime Rate: గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిన నేరాలు.. నియంత్రణలో పోలీసుల పనితీరు సూపర్
చిరునామా మార్పు: ప్రస్తుతం రూ.50 ఉండగా, అక్టోబర్ 1, 2025 నుంచి రూ.75కి పెరుగుతుంది.
బయోమెట్రిక్ అప్డేట్: 17 ఏళ్లు దాటిన వారికి ప్రస్తుతం రూ.100 ఉండగా, రూ.125కి పెరుగుతుంది.
రెండో విడత (అక్టోబర్ 1, 2028): ఛార్జీలు రూ.100-రూ.125గా ఉంటాయి.
మూడో విడత (సెప్టెంబర్ 30, 2031): ఛార్జీలు రూ.90-రూ.150 మధ్య ఉంటాయి.
Also Read: Local Body Elections: రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ.. హాట్ టాపిక్ మారిన రిజర్వేషన్ల అంశం
ఉచిత సేవలు
కొత్త ఆధార్ ఎన్‌రోల్మెంట్ ఉచితం.
5-7 ఏళ్ల పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం.
15-17 ఏళ్ల వారికి బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం.
Also Read: Kishan Reddy: మేము ఏ పార్టీలో కలవబోం.. ఒంటరిగానే మా భవిష్యత్ ప్రయాణం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆధార్ కేంద్రాల వివరాలు
ప్రస్తుతం ఆధార్ కేంద్రాల్లో పాత ఛార్జీలు (రూ.50, రూ.100) ఉన్నప్పటికీ, అక్టోబర్ 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి. UIDAI డిప్యూటీ డైరెక్టర్ హిమాన్షు దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు ఈ సమాచారాన్ని అందించారు.
పిల్లల ఆధార్ కోసం కొత్త కార్యక్రమం
UIDAI చిన్న పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ కోసం పాఠశాలలో ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది, ఇది ఉచిత సేవగా అందుబాటులో ఉంటుంది.