Ravi-Sharma
లేటెస్ట్ న్యూస్, స్పోర్ట్స్

Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

Toss controversy: భారత్ – పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌ టాస్ సమయంలో (Toss controversy) ఆసక్తికరమైన ఘటన జరిగింది. భారత మాజీ దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి… పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో మాట్లాడలేదు. ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టు కూర్పు, వ్యూహం గురించి రవిశాస్త్రి అడిగాడు. సూర్య మాట్లాడడం పూర్తయిన తర్వాత, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ముందుకు రాగా, రవిశాస్త్రి మాట్లాడకుండా పక్కకు తప్పుకున్నాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ముందుకొచ్చి సల్మాన్ అలీ ఆఘాతో మాట్లాడాడు.

Read Also- Telangana Education: విద్యార్థులకు ల్యాబ్ మ్యాన్యుయల్స్.. ప్రతి క్లాసుకు 2 కాపీల చొప్పున పంపిణీ

ఈ దృశ్యాన్ని చూసిన స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు టీవీల్లో చూసినవారు కూడా ఆశ్చర్యపోయారు. అయితే, ఈ నిర్ణయం ముందుగానే జరిగినట్టు వెల్లడైంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను సంప్రదించి, ఫైనల్‌ మ్యాచ్‌కు న్యూట్రల్ ప్రెజెంటర్ ఉండాలని కోరడంతో ఈ విధంగా ఏర్పాటు చేసినట్టు క్లారిటీ వచ్చింది.

అయితే, అసలు విషయం తెలియక క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక పాకిస్థాన్ కెప్టెన్‌తో రవిశాస్త్రి మాట్లాడలేదంటూ నెటిజన్లు పోస్టులు పెట్టారు.

Read Also- Cyber Crimes: స్మాట్‌గా ఆకర్షిస్తారు… నీట్‌గా మోసం చేస్తారు… పెరుగుతున్న సైబర్ మోసాలు

కాగా, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాయాది దేశం పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత తుది జట్టులో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఆడారు. పాకిస్థాన్ తుది జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా ( కెప్టెన్), హుస్సేన్ తలత్, మొహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీం అశ్రఫ్, షాహీన్ అఫ్రీది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్ చోటుదక్కించుకొని ఆడారు.

Just In

01

Ram Charan: చేతులపై కిరోసిన్ పోసుకుని మ్యూజిక్ కొట్టావా థమన్.. ‘ఓజీ’ మ్యూజిక్‌పై చరణ్ రియాక్షన్

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి వచ్చేది ఎప్పుడంటే..

KTR: జూబ్లీహిల్స్‌లో టూరిస్ట్ మంత్రుల ఎన్నికల ప్రచారం.. ఎన్నికలు అయిపోగానే గాయబ్!

Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

CM Revanth Reddy: దేశానికే ఆదర్శంగా నిలవనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం