Medak district ( image vcredit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Medak district: ఆ జిల్లాలో జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు!

Medak district: స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నిర్వహణలో భాగంగా మెదక్ జిల్లాలోని (Medak district) జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు స్తానిక సంస్థల ఎన్నికల (ZPTC, MPP Election) మార్గదర్శకాలను అనుసరిస్తూ రిజర్వేషన్ లు ఖరారు చేయడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్ లో అదనపు కలెక్టర్ నగేష్ , జెడ్పీ సీ.ఈ.ఓ ఎల్లయ్య , లతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని 21 జెడ్.పి.టి.సి, ఎం పి.పి స్థానాల కోసం ఎస్.సి, ఎస్.టి, బి.సి, జనరల్ కటగిరీలలో మహిళా రిజర్వేషన్లను వీడియో రికార్డింగ్ మధ్యన, నిబంధనలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

బీ.సి లకు 9 స్థానాలు రిజర్వ్

2011 జనాభా ప్రాతిపదికన ఎస్.సి, ఎస్.టి రిజర్వేషన్లు, బీ.సీ డెడికేషన్ కమిషన్ నివేదికను అనుసరిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల మార్గదర్శకాలకు అనుగుణంగా బి.సి రిజర్వేషన్ కేటాయింపులు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని మొత్తం 21 జెడ్.పి.టి.సి స్థానాలకు గాను ఎస్.టిలకు 2 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఎస్.సి లకు 4 జెడ్.పీ.టీ.సి స్థానాలు రిజర్వ్ కాగా, మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీ.సి లకు 9 స్థానాలు రిజర్వ్ కాగా, వీటిలో 4 స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు. మిగతా 6 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 3 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని వివరించారు.

అదేవిధంగా జిల్లాలోని 21 ఎం.పీ.పీ స్థానాలకు గాను ఎస్.టిలకు 2 స్థానాలు రిజర్వ్ అయ్యాయని, అందులో ఒకటి మహిళకు రిజర్వ్ అయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఎస్.సి లకు 4 ఎం.పీ.పీ స్థానాలు రిజర్వ్ కాగా, మహిళలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయని అన్నారు. బీ.సి లకు 9 స్థానాలు రిజర్వ్ కాగా, వీటిలో 4 స్థానాలు మహిళలకు కేటాయించబడినాయని తెలిపారు. మిగతా 6 మండలాలు జనరల్ కేటగిరిలో ఉండగా, వీటిలో 3 స్థానాలు మహిళలకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ఖరారైన రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు నివేదించడం జరుగుతుందని తెలిపారు.

 వివరాలు ఇలా ఉనాయి

మెదక్ మండల జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాకు బి సి జనరల్ ,చిలిపిచేడ్ జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, ఎస్టి మహిళ కు రిజర్వు అయ్యాయి. టెక్మాల్ జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు ఎస్టి జనరల్,మాసాయిపేట ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు ఎస్సీ మహిళా ,నర్సింగి జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలు ఎస్సీ జనరల్,అల్లదుర్గం జడ్పిటిసి ఎంపీపీ స్థానాలు ఎస్సీ జనరల్, ఎల్దుర్తి జడ్పిటిసి ఎంపీపీ స్థానాలు ఎస్సీ మహిళా, చేగుంట జడ్పిటిసి ఎంపీపీ స్థానాలు బి సి మహిళాకు రిజర్వు అయ్యాయి.

పాపన్నపేట మండల జడ్పీటీసీ ఎంపీపీ స్థానాలకు బి సి జనరల్ చిన్నశంకరంపేట ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు బి సి జనరల్, రేగోడు ఎంపీపీ జడ్పిటిసిల స్థానాలకు బి సి మహిళా, హవేలీ గణపురం జడ్పిటిసి ఎంపీపీ స్థానాలకు బి సి జనరల్,శివంపేట బీసీ మహిళా, కౌడిపల్లి జడ్పిటిసి ఎంపీపీ స్థానాలకు బీ సి జనరల్,నర్సాపూర్ ఎంపీపీ జడ్పిటిసి స్థానాలకు బి సి మహిళా,పెద్దశంకరంపేట, ఎంపీపీ జడ్పిటిసి స్థానాలకు జనరల్ మహిళా, మనోరాబాద్ మండల జడ్పిటిసి ఎంపీపీ స్థానాల కు జనరల్,తూప్రాన్ ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు జనరల్ ,నిజాంపేట్ మండల జడ్పిటిసి ఎంపీపీ స్థానాలు జనరల్ మహిళా , కొల్చారం మండల ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు జనరల్ ( ఆన్ రిజర్వుడు) జనరల్ , రామయంపేట మండల ఎంపీపీ స్థానానికి( అన్ రిజర్వుడు) ,జడ్పీటీసీ స్థానానికి (అన్ రిజర్వుడు) జనరల్,స్థానం గా రిజర్వేషన్లు ఖరారు చేశారు.

ఉమ్మడి జిల్లా లో జెడ్పీ చైర్మన్ ల…రిజర్వేషన్‌ ల వివరాలు?

సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎస్సీ జనరల్ రిజర్వు,సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి బి సి జనరల్,మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి జనరల్ (ఆన్ రిజర్వుడు) గా రిజర్వేషన్ లు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుంది.ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్,ప్రావీణ్య,సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి,లు ఆయా జిల్లాల జెడ్పిటిసి ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.

 Also Read: Toilet Habits: టాయిలెట్‌ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే, ఆ ప్రాణాంతక సమస్య రావడం పక్కా!

సూర్యాపేట జిల్లా ఎంపీపీ జడ్పిటిసి ఇలా రిజర్వేషన్ల వివరాలు…

1) అనంతగిరి MPP, ZPTC SC జనరల్

2) ఆత్మకూరు ఎస్ MPP BC జనరల్ ZPTC BC మహిళ

3) చిలుకూరు MPP ZPTC జనరల్

4) చింతలపాలెం MPP ZPTC BC మహిళ

5) చివ్వెంల MPP ZPTC జనరల్

6) గరిడేపల్లి MPP ZPTC BC జనరల్

7) హుజూర్ నగర్ MPP, ZPTC SC మహిళ

8) జాజిరెడ్డి గూడెం MPP జనరల్ ZPTC జనరల్ మహిళ

9) కోదాడ MPP ZPTC BC జనరల్

10) మద్దిరాల MPP జనరల్ మహిళ,ZPTC SC జనరల్

11) మఠంపల్లి MPP BC జనరల్ ZPTC జనరల్ మహిళ

12) మెల్లచెరువు MPP ZPTC BC మహిళ

13) మోతే MPP ST జనరల్ ZPTC ST మహిళ

14) మునగాల MPP ZPTC SC జనరల్

15) నడిగూడెం MPP BC మహిళ ZPTC BC జనరల్

16) నాగారం MPP BC మహిళ ZPTC BC జనరల్

17) నేరెడుచర్ల MPP BC జనరల్ ZPTC BC మహిళ

18) నూతనకల్ MPP SC జనరల్ ZPTC SC మహిళ

19) పాలకీడు MPP జనరల్ మహిళ ZPTC జనరల్

20) పెన్ పహాడ్ MPP BC మహిళ ZPTC BC జనరల్

21) సూర్యాపేట MPP SC మహిళ ZPTC BC మహిళ

22) తిరుమలగిరి MPP ZPTC ST జనరల్

23) తుంగతుర్తి MPP ST మహిళ ZPTC ST మహిళ

 Also Read: Hyderabad Floods: ఉగ్రరూపం దాల్చిన మూసీ నది.. జలదిగ్భందంలో బస్తీలు

Just In

01

Hyderabad-Vijayawada: హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం 2 గంటలే: మంత్రి కోమటి రెడ్డి

Election Commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ అబ్జర్వర్ల నియామకం

Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్.. ఆ ఫోన్ కొంటే స్మార్ట్ టీవీ ఫ్రీ.. వివరాలు ఇవే..

Upasana: ఢిల్లీ సీఏం రేఖా గుప్తాతో బతుకమ్మ ఆట.. ఉపాసన రేంజ్ చూశారా?

Bathukamma Flowers: బతుకమ్మలో పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలతో ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలో తెసుసా?