Alia at Ambani Event
Cinema

Bollywood: ఆలియా..వచ్చె‘నయా’

Alia Bhatt special attraction at Ananth ambani Radhika event:
బాలీవుడ్ లో ఆలియాభట్ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన ఆలియా ఫ్యాషన్ ట్రెండ్స్ లోనూ దూసుకుపోతోంది. ప్రత్యేకించి యూత్ లో ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆలియా జిగ్రా చిత్రంలో కనిపించనుంది. ఇందులో వేదాంగ్ రైనా కీల‌క న‌టుడు. కరణ్ జోహార్‌తో కలిసి ఆలియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెప్టెంబర్ 27న ఇది థియేటర్లలో విడుదల కానుంది. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌లతో కలిసి ఫర్హాన్ అక్తర్ నిర్మిస్తున్న జీ లే జరాలో కూడా అలియా నటించాల్సి ఉంది. ఈ సినిమా ఆగిపోలేద‌ని ఇటీవ‌ల ప్రియాంక చోప్రా క‌న్ఫామ్ చేసింది. తన భర్త, రణబీర్ కపూర్ -విక్కీ కౌశల్‌తో కలిసి సంజయ్ లీలా భ‌న్సాలీ `లవ్ అండ్ వార్‌`లో నటించనుంది. త్వరలోనే యశ్ రాజ్ ఫిలిం బ్యానర్లో స్పై యూనివర్స్‌లో యాక్ష‌న్ క్వీన్ గా న‌టించ‌నుంది.

అంబానీ ఈవెంట్ లో అదుర్స్

ఆలియా ఇటీవల ఫ్రాన్స్‌లోని అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ల‌ రెండవ ప్రీ-వెడ్డింగ్ వేడుకలలో అద్భుతంగా కనిపించారు. ఈవెంట్ కోసం ఆలియా ఎంపిక చేసుకున్న దుస్తులను ప్రఖ్యాత డిజైనర్ సభ్య‌సాచి ముఖర్జీ రూపొందించారు. అలియా ధరించిన సభ్య‌సాచి ప్యాంట్‌సూట్ ఆధునికత‌, సాంప్రదాయ హస్తకళల సంపూర్ణ సమ్మేళనం అని చెప్పాలి. జపనీస్ కాటన్, ఇండియన్ సిల్క్స్, రీసైకిల్డ్ నైలాన్, హ్యాండ్‌వాష్డ్ డెనిమ్‌ సహా ఫైన్ రిసార్ట్ వేర్ మెటీరియల్‌ల ప్రత్యేకమైన కలయికతో తయారు చేసిన‌ ఈ దుస్తులు రిచ్ లుక్ ని తెచ్చాయి. ఈ త‌ర‌హా మెటీరియల్ వినియోగం సభ్య‌సాచికే చెల్లింది. అత‌డి ఆలోచ‌న‌ల్లో స్థిర‌త్వం, నిబద్ధతను హైలైట్ చేయడమే కాకుండా మన్నికైన దుస్తుల ఎంపిక‌ను నిర్ధారిస్తుంది. ఇది వైబ్రెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సూట‌బుల్ డ్రెస్ అన‌డంలో సందేహం లేదు. ఈ ప్యాంట్‌సూట్‌ను ఆర్టిసానల్ హెరిటేజ్ ఎంబ్రాయిడరీ.. ఒరిజినల్ ప్రింట్స్‌తో అలంకరించారు. ది సబ్యసాచి ఆర్ట్ ఫౌండేషన్ రూపొందించిన‌ క‌ళాఖండంగా దీనిని చూడాలి. నేటిత‌రం మెచ్చే ఫ్యాషన్ సెన్సిబిలిటీలతో దీనిని రూపొందించారు. ఎంబ్రాయిడరీలు సాంప్రదాయ భారతీయ హస్తకళను ప్రదర్శించాయి. అయితే ఈ డ్రెస్ పై ప్రింట్‌లు ఆధునిక ట్విస్ట్‌ను అద్దాయి. సబ్యసాచి సిగ్నేచర్ స్టైల్‌కి క‌చ్చితమైన ప్ర‌తిరూపంగా నిలిచింది ఆలియా. అనంత్- రాధికల ప్రీవెడ్డింగ్ వేడుకలకు అలియా భట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌డంలో స‌భ్య‌సాచి లుక్ డిజైన్ కే క్రెడిట్ దక్కుతుందని సినీ అభిమానులు అంటున్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?