Jogulamba Temple: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ శక్తి పీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గీత,కూతురు నైమిశా,అల్లుడు సత్యనారాయణ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం జోగులాంబ గద్వాల జిల్లాలోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కుటుంబ సభ్యులైన భార్య గీత,కూతురు నైమిశా, అల్లుడు సత్యనారాయణ రెడ్డిలకు ఆలయ అధికారులు, పూజారులు సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు మొదటగా బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో గణపతి పూజ స్వామివారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also Read: Puri Sethupathi movie: పూరి, సేతుపతి సినిమా నుంచి మరో అప్డేట్.. టీజర్ లాంచ్ ఎక్కడంటే?
అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు
అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దర్శనానంతరం ఆలయ పూజారులు వారికి ఆలయ విశిష్టత వివరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చి అమ్మవారి పట్టు వస్త్రాలతో పాటు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి జ్ఞాపికను బహుకరించారు. దేశంలోని 18 శక్తి పీఠాలలో జోగులాంబ అమ్మవారు ఐదవ శక్తిపీఠంగా ఎంతో ప్రసిద్ధిగాంచినదని సీఎం సతీమణి గీత తెలిపారు.
ఈ ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందం
ప్రస్తుతం జరుగుతున్న శరన్నవరాత్రుల సందర్భంగా అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారన్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, పాడి పంటలతో కలకలాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ,మాజీ జెడ్పిటిసి సరితా తిరుపతయ్య, గద్వాల్ సంస్థాన వారసుడు కృష్ణ రాంభూపాల్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు,అలంపూర్ మార్కెట్ యార్డు చైర్మన్ దొడప్ప,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Kothagudem Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. ఎస్పీ కీలక సూచనలు