Ind Vs SL: ఆసియా కప్-2025లో గ్రూప్-4 దశలో చివరి మ్యాచ్ షూరు అయింది. భారత్ – శ్రీలంక జట్ల (Ind Vs SL) మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చరిత అసలంక ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
తుది జట్లు ఇవే
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
శ్రీలంక : పతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసాల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, దాసున్ శనక, వాణిందు హసరంగ, జనిత్ లియానేజ్, దుష్మంత చమీర, మహీష్ తీక్షణ, నువాన్ తుషార.
Read Also- Viral News:హెల్త్ బాలేక ఒక్క రోజు లీవ్ తీసుకున్న బ్యాంక్ ఉద్యోగికి హెచ్చార్ నుంచి అనూహ్య మెసేజ్
టీమిండియాలో 2 మార్పులు
టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, భారత జట్టులో రెండు మార్పులు చేసినట్టు చెప్పాడు. జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే స్థానాల్లో పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా జట్టులోకి వచ్చారని తెలిపాడు. ‘‘మా ఆటను అదే విధంగా కొనసాగించాలనుకుంటున్నాం. టాస్ గెలిస్తే మేము మొదట బ్యాటింగ్ ఎంచుకోవాలని అనుకున్నాం. ఈ రోజు వాతావరణం బావుంది. మంచి మ్యాచ్ ఉంటుంది’’ అని సూర్య పేర్కొన్నాడు. గత మ్యాచ్‌లో నేలపాలు చేసిన క్యాచ్‌లపై స్పందిస్తూ, మ్యాచ్‌లో భాగమేనని చెప్పాడు.
Read Also- ICC Hearing: ఐసీసీ విచారణకు పాక్ ప్లేయర్లు.. విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావిస్తూ వివరణ
మాకు ముఖ్యమైన మ్యాచ్: శ్రీలంక కెప్టెన్
టాస్ సందర్భంగా శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక మాట్లాడుతూ, ఫస్ట్ బౌలింగ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. ‘‘ ఫైనల్‌కు క్వాలిఫై కాలేమని తెలుసు. అయినప్పటికీ ఇది మాకు ముఖ్యమైన మ్యాచ్. పిచ్ బావుంది. టీమిండియాను 170-175 పరుగుల లోపే కట్టడి చేయాలనుకుంటున్నాం. మా ఓపెనర్లు చక్కగా ఆడుతున్నారు. జట్టులో ఒక మార్పు చేశాం. చమిక కరుణారత్నే స్థానంలో జనిత్ లియానేజ్ తుది జట్టులోకి తీసుకున్నాం’’ అని చరిత్ అసలంక చెప్పాడు.
కాగా, ఆసియా కప్-2025 బెర్తులు ఇప్పటికే ఖరారయ్యారు. ఆదివారం (సెప్టెంబర్ 28) నాడు దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. లీగ్ దశలో, సూపర్-4 దశలో పాకిస్థాన్‌పై టీమిండియా సునాయాస విజయాలు సాధించింది. మరి, ఫైనల్ మ్యాచ్ ఫలితం ఏవిధంగా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది.