Hyderabad ( image credit: swetcha reporter)
హైదరాబాద్

Hyderabad: ప్రారంభానికి సిద్ధమైన ఆరు ఎస్టీపీలు.. మరో 39 కొత్త ఎస్టీపీలకు శంకుస్థాపన

Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేసే లక్ష్యంతో చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టుల్లో భాగంగా ఆరు ఎస్టీపీలు ప్రారంభానికి సిద్దమైనట్లు జలమండలి వెల్లడించింది. అంబర్ పేట్ తో పాటు మరో 5 ఎస్టీపీలను మురుగు నీటి శుద్ధి కేంద్రాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంస్థలు, గ్రామాల్లో ఎస్టీపీలు నిర్మించడానికి 972 మిలియన్ లీటర్స్ పర్ డే (ఎంఎమ్మెల్డీల సామర్థ్యం కల్గిన మొత్తం 39 ఎస్టీపీలకు శంకుస్థాపన చేయనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు.

గ్రేటర్ పరిధిలో డైలీ 150 మిలియన్ లీటర్స్ పర్ డే

జలమండలి పరిధిలో సీవరేజ్ పైప్‌లైన్ నెట్‌వర్క్ సుమారు 10 వేల 753 కి.మీ.పొడువున ఉన్నట్లు వెల్లడించింది. ఈ నెట్ వర్క్ లో దాదాపు 6.14 లక్షల మ్యాన్ హోల్స్ ఉన్నట్లు, వీటితో పాటు 772 మిలియన్ లీటర్స్ పర్ డే (ఎంఎల్ డీ)లతో మరో 25 పాత ఎస్టీపీలున్నట్లు వెల్లడించారు. గ్రేటర్ పరిధిలో డైలీ 150 మిలియన్ లీటర్స్ పర్ డే మురుగు ఉత్పత్తి అవుతున్నట్లు జలమండలి వివరించింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం, 2021లో మురుగు ఉత్పత్తి 1950 ఎంఎల్ డీలుగా గుర్తించగా, ఇది 2036 నాటికి 2800 ఎంఎల్ డీలకు పెరుగుతుందని కూడా అంచనా వేశారు. ఈ మొత్తం మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఔటర్ పరిదిలోని స్థానిక సంస్థల్లో మరో 39 ఎస్టీపీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయగా, గురువారం వాటి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

 Also Read: GHMC Commissioner: భవన నిర్మాణ అనుమతికి సరి కొత్త సంస్కరణలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం

సిద్దమైన ఎస్టీపీలు

వ.సం. ఎస్టీపీ సామర్థ్యం (ఎంఎల్ డీలలో..) వ్యయం (రూ.కోట్లలో..)

1. అంబర్ పేట 212.50 319.43

2. అత్తాపూర్ 64.00 109.24

3. ముళ్లకత్వా 25.00 44.46

4. శివాలయనగర్ 14.00 34.13

5. వెన్నలగడ్డ 10.00 13.00

6. పాలపిట్ట 7.00 18.87

అమృత్ 2.0 స్కీమ్ కింద శంకుస్థాపన చేయనున్న ఎస్టీపీలు

వ.సం. అంశం సామర్థ్యం (ఎంఎల్ డీలలో) మొత్తం వ్యయం (రూ.కోట్లలో..)

1. ప్యాకేజీ-1లోని 16 ఎస్టీపీలు 493.50 1878.55

2. ప్యాకేజీ-2లోని 22 ఎస్టీపీలు 471.50 1906.44

3. ఒక ఎస్టీపీ(పీపీపీ మోడల్) 7.00 64.11

మొత్తం ఎస్టీపీలు 39 972.00 3849.10

 Also Read: Pradeep Ranganathan: ప్రత్యేకించి దాని కోసమే హైదరాబాద్ వచ్చిన ప్రదీప్ రంగనాధన్.. ఏం అన్నాడంటే?

Just In

01

BSNL 4G: ప్రధాని మోదీ చేతులు మీదుగా రెండు కీలక కార్యక్రమాలు.. శనివారమే ప్రారంభం

OTT Movie: వైరస్‌తో ప్రపంచం నాశనమైన 28 ఏళ్ల తర్వాత.. ఏం థ్రిల్ ఉంది గురూ..

Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత

Jangaon District: నేటి మ‌హిళా లోకానికి దిక్సూచి.. పోరాటానికి ప్రతీక చాక‌లి ఐల‌మ్మ‌.. ఇన్‌చార్జీ క‌లెక్ట‌ర్ కీలక వ్యాఖ్యలు

Jio Offers: అదిరిపోయే న్యూస్.. రూ.349 రీఛార్జ్ చేసుకుంటే.. గోల్డ్ పొందొచ్చని తెలుసా?