Pradeep Ranganathan: లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ తాజాగా ఓ ప్రత్యేక పనికోసం హైదరాబాద్ వచ్చారు. వరస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూ కేవలం ఓ సినిమా చూడటానికి మాత్రమే హైదరాబాద్ వచ్చాడు. అది ఏ సినిమా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి ‘ఓజీ’ సినిమా. దీంతో ప్రదీప్ రంగనాథన్ కు పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం ఏంటో అర్థం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. దీనిని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. తాజాగా రంగనాథన్ సినిమా చూసిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. ‘నేను కేవలం ఓజీ సినిమా చూడటానికి మాత్రమే హైదరాబాద్ వచ్చాను. ఈ మాస్ ఎక్స్‌పీరియన్స్ తెలుగు వారితో చూస్తేనే పొందగలము’ అంటూ రాసుకొచ్చారు. దీంతో పవన్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
Read akso-Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఇది తెలియదు అనుకుంటా.. ‘ఓజీ’ గురించి మళ్లీ..
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్‌ఐకే): రొమాంటిక్ కామెడీ బ్లాస్ట్విగ్నేష్ శివన్ డైరెక్షన్‌లో తయారైన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (ఎల్‌ఐకే), ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టిల మెయిన్ లీడ్ పెయిర్. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ జోనర్‌లో ఉండే ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు వంటి స్టార్స్ కూడా ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ, డీవాలీ సీజన్‌లో ప్రేక్షకులను హర్షించబోతోంది. టీజర్‌లో ప్రదీప్ ఫాన్సీ లుక్ కనిపించడంతో ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు. ‘డ్యూడ్’ మాస్ ఎంటర్‌టైనర్ కీర్తిశ్వరన్ డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ‘డ్యూడ్’, రొమాంటిక్ యాక్షన్ కామెడీగా రూపొందింది. మమితా బైజు హీరోయిన్‌గా కనిపించబోతుంది. ఈ సినిమా కూడా దివాలీ వీక్‌లో ‘ఎల్‌ఐకే’తో క్లాష్ అవుతోంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలయ్యే ఈ చిత్రం, ప్రదీప్ ఫ్యాన్స్‌కు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని మేకర్స్ తెలిపారు.
Read also-Godari Gattupaina: సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సోల్ ఫుల్ ఫస్ట్ బ్రీజ్ అదిరింది
ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.
Nenu ippudu Hyderabad raavadaniki oke kaaranam #PowerStar #OG choodataaniki maathrame…ee mass experience ni telugu vaallatho chooddame kadha mass pic.twitter.com/E3L4amiht6
— Pradeep Ranganathan (@pradeeponelife) September 25, 2025