ambati-rambabu ( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Ambati Rambabu: అంబటి రాంబాబుకు ఇది తెలియదు అనుకుంటా.. ‘ఓజీ’ గురించి మళ్లీ..

Ambati Rambabu: పవన్ కళ్యాణ్ ఓజీ విడుదల సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మళ్లీ మరో సారి సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి అయినా పవన్ కళ్యాణ్ అయినా సినిమా ఆడాలనేదే నా ఆరాటము అందుకే ఓజీ సినిమా విడుదలకు ముందు మంచి కలెక్షన్స్ రావాలని కోరుకున్నాను. కానీ విడుదల అయ్యాకా సినిమా మాత్రం అనుకున్నంత రేంజ్ లో లేదు. ఫిలితం మాత్రం సూన్యం లాగానే ఉంది. అయ్యో దానయ్య దగా పడ్డావయ్యా అంటూ సోషల మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని చూసిన పవన్ అభిమానులు ‘నీ ఎలక్షన్ ఫలితాలు ఇప్పుడు ఎందుకు చెబుతావు.’ ‘ఇది జగన్ చూడాలనే రాశావు కదా..’ ‘సంధ్య, సుకన్యకు టికెట్లు దొరకలేదు అంట కదా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read also-Komatireddy Venkat Reddy: యువతకు స్కిల్స్ పెంచి, ఉపాధి కల్పించడమే సర్కార్ లక్ష్యం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ఇంతకు ముందు అంబటి ఏం అన్నాడంటే..

‘ముందుగా ఈ సినిమా హిట్ అవ్వాలని కొరుకుంటున్నాను. ఎందుకంటే అంతటి హైప్ ఉంది కాబట్టి. గత రెండు సినిమాలు సరిగా ఆడకపోండంతో ఈ సారి పవన్ మంచి కసిమీద ఉన్నారు. దర్శకుడు కూడా అదే కసితో ఈ సినిమాను తీశారు. అంటూనే టికెట్లు విషయంలో వెయ్యి రూపాయలు పెట్టి ప్రజలను దోచుకోవడం ఎంత వరకూ సమంజసం’ అంటూ ప్రశ్నించారు. ‘ఇప్పుడు అధికారంలో ఉండి కూడా మీరు ఇలా చేయడం కరెక్టు’ కాదన్నారు. అంతే కాకుండా ‘‘ఓజీ’ సినిమా మంచి విజయం సాధించి సినిమా హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని, కొణెదల కుటుంబానికి గౌరవం తీసుకురావాలని’ ఆకాంక్షించారు. ఇందులో వ్యంగ్యంగా కూడా కొన్ని మాటలు అన్నారు. అవి.. ‘పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పనులు అన్నీ పక్కన పెట్టి ఈ సినిమా తీయడంలో సహకరించడంతో ఈ సినిమా బాగా వచ్చిందని’ వ్యంగ్యంగా మాట్లాడారు.

Read also-ICC Warning: కెప్టెన్ సూర్య వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్ వార్నింగ్.. జరిమానా విధించే ఛాన్స్!

ఓజీ గురించి..

ఇక సినిమా విషయానికొస్తే.. ఫైర్ స్ట్రోమ్ ముంబాయ్ లో చేసిన విలయ తాండవానికి అభిమానులు మంత్రముగ్థులయ్యారు. ప్రతి సీన్ పవన్ కళ్యాణ్ కోసమే రాసినట్టుగా, అలాగే ప్రతి ఫ్రేమ్ తీసినట్లుగా చూసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక థమన్ అందించిన సంగీతం వచ్చినపుడల్లా అభిమానులు అయితే ఒక రకమైన తన్మయత్వానికి గురయ్యారు. పవన్ కనిపించినంతసేపు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఎవరూ మర్చిపోలేరు. రెండో భాగంలో సినిమా బాగా ఆసక్తికరంగా మారుతుంది. ఎమోషనల్ డెప్త్ ప్రేక్షకులకు బాగా కనెక్టు అవుతుందు. ముగింపు ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓమీ దేనికోసం సినిమా మొత్తం పోరాడాడో దానితోనే అంతమవుతాడు. చివరిగా పార్ట 2 కి అవకాశం ఉన్నా.. సినిమా ఉంటుందని ఎక్కడా రివీల్ చేయలేదు. మొత్తం గా ఈ సినిమా అభిమానులకు ఫుల్ మీల్ గా నిలుస్తోంది.

Just In

01

BSNL 4G: ప్రధాని మోదీ చేతులు మీదుగా రెండు కీలక కార్యక్రమాలు.. శనివారమే ప్రారంభం

OTT Movie: వైరస్‌తో ప్రపంచం నాశనమైన 28 ఏళ్ల తర్వాత.. ఏం థ్రిల్ ఉంది గురూ..

Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత

Jangaon District: నేటి మ‌హిళా లోకానికి దిక్సూచి.. పోరాటానికి ప్రతీక చాక‌లి ఐల‌మ్మ‌.. ఇన్‌చార్జీ క‌లెక్ట‌ర్ కీలక వ్యాఖ్యలు

Jio Offers: అదిరిపోయే న్యూస్.. రూ.349 రీఛార్జ్ చేసుకుంటే.. గోల్డ్ పొందొచ్చని తెలుసా?