TVS Bikes Price Down (Image Source: twitter)
బిజినెస్

TVS Bikes Price Down: టీవీఎస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బైక్ రేట్స్.. మోడల్ వారీగా లిస్ట్ ఇదే!

TVS Bikes Price Down: దేశంలో జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీలో మార్పుల కారణంగా ఆటోమెుబైల్ ధరలు భారీగా దిగివచ్చాయి. ఫలితంగా కార్లు, బైక్ రేట్సు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా 350cc ద్విచక్రవాహనాలపై పెద్ద ఎత్తున ధరల తగ్గింపు ప్రభావం కనిపిస్తోంది. తగ్గిన ట్యాక్స్ కు అనుగుణంగా బైక్ కంపెనీలు కొత్త ధరలను ప్రకటిస్తున్నాయి. ఈ కోవలోనే టీవీఎస్ సైతం తన బైక్స్ పై మోడల్స్ వారీగా ధరలను తగ్గించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

రూ.25 వేల వరకూ తగ్గింపు
జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా టీవీఎస్ పెట్రోల్ వాహనాలపై విధించే పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ఎలక్ట్రిక్ మోడళ్లపై గతంలో విధించిన 5శాతం పన్ను అలాగే ఉండటంతో ఈ బైక్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని టీవీఎస్ వర్గాలు ప్రకటించాయి. అయితే 350cc మోడల్ కలిగిన బైక్స్ పై మోడల్స్ ఆధారంగా రూ.4,000 – 25,000 వరకూ ధర తగ్గించినట్లు టీవీఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా అపాచీ ఆర్‌టీఆర్ 310 (Apache RTR 310) బైక్ ధర అత్యధికంగా తగ్గినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో టీవీఎస్ బైక్స్ కొత్త ధరలేంటో ఇప్పుడు చూద్దాం.

అపాచీ ఆర్ టీఆర్ 160
అపాచీ లేటెస్ట్ మోడల్ ఆర్‌టీఆర్ 160 ధర.. జీఎస్టీ 2.0కు ముందు రూ.1.21-1.34 లక్షల మధ్య ఉంది. అయితే తాజాగా దీని ధర రూ. 1,11,490 – 1,23,290కు తగ్గింది. గతంతో పోలిస్తే రూ. 9,930 – 11,030 ధర తగ్గడం గమనార్హం.

అపాచీ ఆర్ టీఆర్ 160 4వీ (RTR 160 4V)
ఈ బైక్ పాత ధర రూ. 1,25,670 – 1,47,990 మధ్య ఉంది. జీఎస్టీ తగ్గింపుతో దీని కొత్త ధర రూ. 1,15,852 – 1,35,840 చేరింది. గతంతో పోలిస్తే రూ. 9,818 – 12,150 మేర తగ్గింది.

అపాచీ ఆర్‌టీఆర్ 180 (Apache RTR 180)
ఈ బైక్ పాత ధర రూ. 1,35,020. తాజా సంస్కరణలతో రూ.10,130 మేర ధర తగ్గి రూ. 1,24,890కు చేరింది.

ఆర్ టీఆర్ 200 4వీ (Apache RTR 200 4V)
ఈ బైక్ ధర రూ. 3,780 – 11,370 మేర తగ్గడంతో దేశవ్యాప్తంగా ఉన్న టీవీఎస్ షోరూంలో రూ. 1,41,290 – 1,48,620 మధ్య దీనిని విక్రయిస్తున్నారు.

అపాచీ ఆర్ఆర్ 310 (Apache RR 310)
అపాచీ హైఎండ్ మోడల్ అయిన ఈ బైక్ ధర గతంలో రూ. 2,77,999 – 2,94,999 మధ్య ఉండేది. టీవీఎస్ సంస్థ దీని ధరను రూ. 21,759 – 23,059 తగ్గించింది. దీంతో రూ. 2,56,240 – 2,71,940 మధ్య ఈ బైక్ విక్రయాలు జరుగుతున్నాయి.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City +)
మధ్యతరగతి ప్రజల్లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ కు మంచి క్రేజ్ ఉంది. తక్కువ ధరకు లభించడంతో పాటు ఎక్కువ మైలేజ్ ఇస్తుండటంతో గ్రామాలు, మండలాల్లో ఎక్కువ మంది ప్రజలు ఈ బైక్ నే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే జీఎస్టీ 2.0లో భాగంగా ఈ బైక్ ధర కూడా తగ్గింది. గతంతో పోలిస్తే రూ. 6,386 – 6,686 తక్కువకే విక్రయిస్తున్నారు. దీని కొత్త ధర రూ. 72,200 – 74,900.

Also Read: Amazon Offers: అమెజాన్ బంపరాఫర్.. తక్కువ ధరకే బెస్ట్ ల్యాప్ టాప్స్.. అస్సలు మిస్ అవ్వకండి!

స్కూటర్లు & మోపెడ్ ధరలు
గ్రామాల్లో అత్యధికమంది ఉపయోగించే ఎక్స్ ఎల్ స్కూటర్ ధరలు సైతం తగ్గాయి. గతంలో రూ. 47,754 – 65,047 మధ్య సేల్ అయిన ఈ స్కూటర్.. ప్రస్తుతం రూ. 43,900 – 59,800 అందుబాటులోకి వచ్చింది. స్కూటర్ పై రూ. 3,854 – 5,247 మేర ధర తగ్గింది. మరోవైపు జూపిటర్ 110cc స్కూటీ రూ.6000 వరకూ తగ్గి ప్రస్తుతం రూ. 65,800 – 68,300 మధ్య సేల్ అవుతోంది. జూపిటర్ 125cc కొత్త ధర రూ. 82,000 – 92,300
అవుతోంది. గతంతో పోలిస్తే దీని ధర రూ. 8వేల వరకూ తగ్గింది.

Also Read: Guinness Record: గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టిన.. ఇండియన్ స్టీల్ మ్యాన్.. 261 కేజీలను అలవోకగా!

Just In

01

Bathukamma Kunta: బతుకమ్మ కుంట గ్రాండ్ ఓపెనింగ్.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్సవాలు

Thaman speech: అలా ఏమీ చేయకపోయినా ‘ఓజీ’ హిట్ చేశారు.. ఎందుకంటే?

OG Producer: నిర్మాత నాగవంశీకి థ్యాంక్స్ చెప్పిన ‘ఓజీ’ నిర్మాత.. ఎందుకో తెలుసా?

Police Misconduct: సీక్రెట్‌గా మహిళా కంటెంట్ క్రియేటర్‌ కారుని ట్రాక్ చేసిన పోలీస్.. ఎక్కడికి దారి తీసిందంటే?

GHMC Commissioner: భవన నిర్మాణ అనుమతికి సరి కొత్త సంస్కరణలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం