Betting Apps: బెట్టింగ్ యాప్ ల కేసులో సీఐడీ (CID) దూకుడు పెంచింది. మూడు రాష్ట్రాల్లో దాడులు చేసిన సిట్ అధికారులు బెట్టింగ్ యాప్ (Betting Apps)లను నడుపుతున్న 8మందిని బస్ట్ చేశారు. పలువురి ఆత్మహత్యలకు కారణమవటంతోపాటు ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా దెబ్బ తీసి రోడ్లపాలు చేసిన బెట్టింగ్ యాప్‌లపై మియాపూర్, పంజగుట్ట పోలీస్ స్టేషన్లలో(Panjagutta Police Stations) కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత వీటిని సీఐడీ అదనపు డీజీపీ చారూ సిన్హా నేతృత్వంలోని సిట్ కు అప్పగించారు.
తెలుగు365, ఎస్365 యాప్ లపై దృష్టి
దర్యాప్తు మొదలు పెట్టిన సిట్ బృందం ఎక్కువగా ఫిర్యాదులు అందిన తాజ్0077, ఫెయిర్ ప్లే.లైవ్ ఆంధ్రా365, వీఐబుక్, తెలుగు365, ఎస్365 యాప్ లపై దృష్టిని సారించారు. రాజస్తాన్, గుజరాత్ర, పంజాబ్ ల నుంచి ఈ యాప్ లను నడుపుతున్నట్టుగా విచారణలో నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన సిట్ బృందాలు మొత్తం 6చోట్ల దాడులు జరిపాయి. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్‌లను నడుపుతున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశాయి.
హార్డ్ వేర్ డివైస్‌లను స్వాధీనం
విచారణలో ఈ ఎనిమిది మంది విదేశాల్లో ఉంటూ యాప్ లను నిర్వహిస్తున్న వారికి కీలక సహకారం అందిస్తున్నట్టుగా వెల్లడైంది. ఇక, దాడుల్లో సిట్ బృందాలు పలు హార్డ్ వేర్ డివైస్ లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్ల వివరాలు, వాటి ద్వారా భారీగా జరిగిన నగదు లావాదేవీలను గుర్తించారు. దాంతోపాటు ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడీలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో కొన్ని బ్యాంక్ ఖాతాలను అధికారులు ఫ్రీజ్ చేయించారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్టు అదనపు డీజీపీ చారూ సిన్హా తెలిపారు. త్వరలోనే మరింత మంది నిందితుల అరెస్టులు ఉంటాయన్నారు.
Also Read: Seethakka: మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలి.. మంత్రి సీతక్కఆదేశం