Warangal District: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చారిత్రాత్మక, ఆధ్యాత్మిక నగరం ఓరుగల్లులో అత్యంత ఎత్తైన దుర్గామాత మట్టి విగ్రహం ఆకట్టుకుంటూ భక్తులచే ప్రత్యేక పూజలు అందుకుంటుంది. ఈ ఏడాది హనుమకొండ(Hanumakonda) జిల్లా రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శరన్నవరాత్రి ఉత్సవాలకు శోభను తీసుకు వచ్చింది. ఒడిశాకు చెందిన 25 మంది కళాకారులు అమ్మవారి విగ్రహాన్ని అత్యంత నిష్ఠతో భక్తి శ్రద్ధలతో తయారు చేశారు.
51 అడుగుల త్రిశక్తి మాత విగ్రహం..
హనుమకొండ రెడ్డికాలనీ జంక్షన్ లో ప్రతిష్ఠాపన.. త్రిశక్తి మాతగా భక్తులకు దుర్గాదేవి దర్శనం ఇస్తుంది. దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పలు కాలనీల్లో దుర్గా దేవి ఉత్సవాల నిర్వహణకు మండపాలను ఏర్పాటు చేసుకొని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే హనుమకొండ రెడ్డి కాలనీ జంక్షన్ లో రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ అమ్మవారి విగ్రహం ఏకంగా 51 అడుగులు ఉండటం విశేషం. ఇంత భారీ అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. నగరంలో 51 అడుగుల భారీ అమ్మవారి విగ్రహం ఉదయం సాయంత్రం నిత్య పూజలు అందుకుంటుంది. రెడ్డి కాలనికి భక్తులు సహా పలు జిల్లా నలుమూలల నుండి భారీగా భక్తులు తరలి వచ్చి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అందుకు తగినట్టుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.
Also Read: Hijras Attack Nurse: హిజ్రాల రౌడీయిజం.. డబ్బు ఇవ్వలేదని.. నర్సు బట్టలు చించి వీరంగం!
పలు రూపాల్లో పూజలు అందుకుంటున్న మాత..
హనుమకొండ రెడ్డి కాలనీ జంక్షన్ లో ప్రతిష్టించిన అమ్మవారు త్రిశక్తి మాతగా భక్తులకు దర్శనం సహా లక్ష్మి, దుర్గా, సరస్వతి, శక్తి అమ్మవార్లను ప్రతిబింభించేలా ఈ రూపం కనువిందు చేస్తోంది. ఈ భారీ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసేందుకు ఒరిస్సాకు చెందిన శిల్పులు గణేష్, శివ ల సారధ్యంలోని 20మంది కళాకారుల బృందం దాదాపు 50 రోజుల పాటు అహర్నిశలు పని చేశారు. విగ్రహ తయారీలో మట్టి, ఉనుక, ముల్తాన్ మట్టి, గడ్డి, సహజసిద్ధమైన రంగులను వినియోగించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఈ విగ్రహాన్ని అక్టోబర్ 3న అక్కడే పాలతో నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు
ప్రతిష్టించిన చోటనే పాలతో నిమజ్జనం.
భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని 3 సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నాం. కానీ ఈ సారి సాధ్యమైంది. నిత్యం పూజలు నిర్వహిస్తున్నాం. దుర్గా దేవి నవరాత్రి ఉత్సావాలు నిర్వహణ అనంతరం చివరి రోజు 2క్వింటాళ్ల పసుపు, 2 క్వింటాళ్ల కుంకుమ,1ట్యాంకర్ పాలతో అక్టోబర్ 3న నిమజ్జనం చేయబోతున్నాం.
16 ఏండ్లుగా ఉత్సవాలు నిర్వహణ..
రెడ్డి కాలనిలో 16 ఏండ్లుగా శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సారి 51 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించాం. వచ్చే భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. రెడ్డి కాలనీ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అందరూ భాగస్వామ్యంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని దుర్గ ఉత్సవాల సందర్భంగా మా యూత్ సభ్యులు 30 మంది వాలంటరీగా సర్వీస్ ఇస్తున్నారు. కాలనీ వాసులు అంతా ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నారని, యూత్ సభ్యుడు ఎండీ అన్వర్ ఖాన్ తెలిపాడు.
Also Read: Telangana BJP: కొత్త నేతలతో టీమ్ వర్క్‌కు బీజేపీ ప్లాన్.. సమన్వయం కుదిరేనా..!