Telangana BJP: బీజేపీ రాష్ట్ర నాయకత్వం నేతల మధ్య సమన్వయంతో కొట్టుమిట్టాడుతోంది. ఈనేపథ్యంలో పార్టీ ఇంటర్నల్ గా స్ట్రాంగ్ అవ్వడంపై దృష్టిసారించనుంది. భవిష్యత్ ఎన్నికల నేపథ్యంలో సమస్యలను అధిగమించడంపై దృష్టిసారిస్తోంది. ఇటీవల కాషాయ పార్టీ రాష్ట్ర నాయకత్వం కొత్త కమిటీని ప్రకటించింది. కాగా తొలి సమావేశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) అధ్యక్షతన నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్ చార్జీ చంద్రశేఖర్ తివారి కమిటీల్లో కోఆర్డినేషన్ ముఖ్యమని కొత్త కమిటీకి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాషాయ పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే. అయితే వీటిని కంట్రోల్ చేయడంపై పార్టీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గ్యాప్ లేకుండా అంతా ఒక్కటే అని చాటిచెప్పాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఆశావహులు చాలామంది నిరాశ..
తెలంగాణ బీజేపీ(BJP) ఇటీవల కొత్త కమిటీలు నియమించుకుంది. అయితే పలువురు సీనియర్లకు కూడా ఆ కమిటీలో చోటు దక్కలేదు. ఆశావహులు చాలామంది నిరాశకు గురయ్యారు. పార్టీలో పోస్టులు తక్కువగా ఉన్నాయని, అందరినీ ఫిల్ చేయడం కష్టమని ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) చెప్పారు. అయితే కమిటీలో చోటు దక్కలేకపోయిందనే బాధ వద్దని, అందరికీ అవకాశాలు వస్తాయని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈనేపథ్యంలోనే తాజా మీటింగ్ లోనూ కమిటీల్లో ఎవరూ ఎక్కువ కాదు.. తక్కువ కాదని, అందరూ సమానమేనని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. టీమ్ వర్క్ తో ముందుకు వెళ్లాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కలిసికట్టుగా ముందుకు వెళ్తే వైఫల్యాలను అధిగమించవచ్చని ఆఫీస్ బేరర్ల మీటింగ్ లో సూచించినట్లు సమాచారం.
Also Read: Visa Free Countries: వీసాతో పని లేని 7 పర్యాటక దేశాలు.. ఒక్కసారి వెళ్లారో అక్కడే సెటిల్ అవుతారు!
పదవులు దక్కనివారు..
పార్టీలో పాత, కొత్త నేతల మధ్య వైరం బీజేపీ(BJP)లో రోజురోజుకూ ముదురుతోంది. దాన్ని కట్టడిచేయడంపైనా పార్టీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. సీనియర్లు, జూనియర్లు, పాత, కొత్త అనే తేడాలు లేకుండా ఒకరినొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపించాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పదవులు దక్కనివారు తక్కువేం కాదని, పదవి దక్కినంత మాత్రాన వారు గొప్ప అనే భావన ఉండొద్దని సూచించారు. పదవి దక్కనివారిపై చిన్నచూపు తగదని, వారికి మర్యాద ఇవ్వాల్సిందేనని ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాకుండా మీడియా ఎదుట ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ.. విమర్శలకు ఆస్కారం ఇవ్వొద్దని పార్టీ రాష్ట్ర సంస్థాగత ఇన్ చార్జీ చంద్రశేఖర్ తివారి దిశానిర్దేశం చేసినట్లు వినికిడి. పార్టీ గీత దాటితే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు చెబుతున్నారు. కొత్త వారికి సమన్వయం చేసేలా టీమ్ వర్క్ తో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. భవిష్యత్ ఎన్నికలకు ముందుగానే పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న యుద్ధానికి చెక్ పెట్టి రచ్చ గెలవాలనే వ్యూహంతో బీజేపీ ఉంది. మరి ఈ వ్యూహం ఎంతమేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.
Also Read: Pawan Kalyan: ‘OG’తో అభిమానుల కల తీరుతుందా.. లేక తేడా కొడుతుందా?