GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అవసరాలకు తగిన విధంగా అభివృద్దితో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC) తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన మరోసారి సమావేశమైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కమిటీ ముందుకు పలు కీలకమైన, ముఖ్యమైన ప్రతిపాదనలు పరిశీలనకు వచ్చాయి. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగింది. ఈ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో..
సమావేశంలో జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి కర్ణన్*(RV Karnan), స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, మహ్మద్ సలీం, డా.ఆయేషా హుమేరా, బాత జబీన్, మహాలక్ష్మి రామన్ గౌడ్, మహమ్మద్ బాబా ఫసియుద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్పతో పాటు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ లు సత్యనారాయణ, వేణుగోపాల్, పంకజ, అలివేలు మంగతాయారు, సుభద్రాదేవి, జోనల్ కమిషనర్ లు అనురాగ్ జయంతి, ఆర్ హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ్ చౌహాన్, రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. అజెండాలోని 14 ప్రతిపాదనలతో పాటు మరో పది అంశాలను టేబుల్ ఐటమ్స్ గా స్వీకరించి కమిటీ ఆమోదం తెలిపింది. టేబుల్ ఐటమ్స్ గా ప్రత్యేక సందర్భాల్లో మటన్, చికెన్, బీఫ్ దుకాణాలను మూసివేసేందుకు కమిషనర్ కు చట్టం ప్రకారమున్న అధికారాలను సద్వినియోగం చేసుకునేందుకు కమిటీ తీర్మానంతో పాటు పలు ఇతర అంశాలను ప్రవేశపెట్టగా, కమిటీ ఆమోదించింది.
Also Read: Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం.. హరీష్ రావు ఫైర్
కమిటీ ఆమోదించిన అంశాలు ప్రతిపాదనలు
1. అల్వాల్ సర్కిల్ లోని చిన్నరాయుని చెరువు నుండి దినకర్ నగర్ వరకు రూ.2.95 కోట్లతో లక్షల అంచనా వ్యయంతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కమిటీ ఆమోదం
2. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో (గ్రౌండ్ ఫ్లోర్, దక్షిణ వైపు) ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నడపటానికి స్నేహిత స్వయం సహాయక సంఘంతో మూడేళ్ల సంవత్సరాల పాటు అవగాహన ఒప్పందంకుదుర్చుకోవడానికి కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
3. కియోస్క్ నెం. 8 (కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్) ఓపెన్ యాక్షన్ లో కేటాయించేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం
4. 145 వార్డు సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుతం ఉన్న మెడికల్ ఇన్సూరెన్స్ పొడిగింపును (ఒరియెంటల్ ఇన్సూరెన్స్ ద్వారా) ఫిబ్రవరి 2026 వరకు కొనసాగించడానికి ర్యాటిఫికేషన్. మొత్తం వ్యయం రూ.33 లక్షల 53 వేల 705 చెల్లించేందుకు కమిటీ అనుమతిస్తూ తీర్మానం చేసింది
5. హెచ్ సిటీ ప్రాజెక్ట్ లలో భాగంగా ఆర్.కే.పురం వద్ద ఆర్ఓబీ, ఆర్ యూబీ నిర్మాణానికి (45 మీ. రోడ్డు వెడల్పు) గానూ 52 ఆస్తుల నుంచి స్థలాల సేకరణకు కమిటీ అనుమతిచ్చింది.
6. యాకుత్‌పురలోని ఎస్.ఆర్.టి కాలనీలో లండన్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి వ్యయం రూ.2.95 కోట్లు, కన్సల్టెంట్ సేవల వినియోగానికి కమిటీ గ్రీన్ సిగ్నల్
7. మల్లేపల్లి (వార్డ్-76) లో రూ. 4.85 కోట్ల వ్యయంతో ఫుట్‌బాల్ గ్రౌండ్ ఆధునికీకరణకు కమిటీ ఆమోదం
8. మౌలాలి (వార్డ్ నం.04) లో జీహెచ్ఎంసీ వార్డ్ కార్యాలయ భవనం ఒకటో అంతస్తులో తాత్కాలిక పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కమిటీ అనుకూల తీర్మానం
9. సుబాష్ చంద్రబోస్ నగర్, ఆదిత్య నగర్ (మాధాపూర్) లో రూ. 2.80 కోట్ల లక్షల వ్యయంతో గ్రేవ్ స్మశానవాటికలో మౌలిక వసతుల కల్పనకు గ్రీన్ సిగ్నల్
10. శిల్పా హిల్స్ (SC శ్మశాన వాటిక), కృష్ణానగర్ (హిందూ శ్మశాన వాటిక) లను రూ.240.00 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు కమిటీ ఆమోదం
11. స్ట్రీట్ లైట్స్ నిర్వహణ కోసం (3 నెలల పాటు) కొత్త టెండర్లు ఆహ్వానించాలా? లేదా ప్రస్తుతమనన్న 17 మంది డీఐసీ విక్రేతలతో కాంట్రాక్ట్ పొడిగించాలా అనే ప్రతిపాదనకు సంబంధించి మూడు నెలలు పొడిగిస్తూ కమిటీ నిర్ణయం
12. ఐబీఐ గ్రూప్ (ఐ) లిమిటెడ్ ఒప్పందాన్ని వచ్చే డిసెంబర్ 19 వరకు ఒక త్రైమాసికం పొడిగించడానికి కమిటీ అనుమతి
13. జీహెచ్ఎంసీ ప్రకటన మాడ్యూల్ మార్పులు చేస్తూ, ట్రేడ్ బోర్డ్స్/ప్రకటన లైసెన్స్ జారీ అధికారాన్ని డిప్యూటీ కమిషనర్లకు అప్పగించడం, అప్పీల్ అధికారులుగా జోనల్ కమిషనర్లను నియమించడం, ఐటీ వింగ్ ద్వారా ప్రకటన మాడ్యూల్ సవరణలు చేయించడానికి కమిటీ ఆమోదం
14. నాగోల్ సరస్సు నుండి ఎస్ ఎన్ డీపీ కింద బాక్స్ డ్రెయిన్ నిర్మాణం (వార్డ్ నం.11, నాగోల్) కోసం వ్యయం రూ.2.98 కోట్లకు పరిపాలనపరమైన అనుమతి.
Also Read: OG movie: ‘ఓజీ’ సినిమా నుంచి మరో రెండు కీలక పాత్రలు రివీల్.. వారు ఎవరంటే?