Minister Sridhar Babu (imagecredit:swetcha)
హైదరాబాద్

Minister Sridhar Babu: గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu: హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఆయన రాయదుర్గంలో బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. హెచ్‌సీఏ హెల్త్‌కేర్ సంస్థకు 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లు ఉన్నాయని, మొత్తం 3.16 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఈ ఫార్చ్యూన్ 100 కంపెనీ వార్షిక ఆదాయం 70 బిలియన్ డాలర్లు అన్నారు.దిగ్గజ సంస్థ అమెరికా వెలుపల భారత్‌లో తన మొట్టమొదటి జీసీసీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణను ఎంచుకోవడం అందరికీ గర్వకారణం అన్నారు. 4లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో హెచ్ సీఏ హెల్త్ కేర్ 75 మిలియన్ డాలర్ల (సుమారు రూ.620కోట్లు) పెట్టుబడి పెట్టనుందన్నారు.

3 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు..

ఈ జీసీసీ కేవలం ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా, ఆరోగ్య సంరక్షణలో నాణ్యత, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందన్నారు. ఐటీ, సప్లై చైన్, ప్రొక్యూర్‌మెంట్, మానవ వనరులు, ఫైనాన్స్, అకౌంటింగ్ తదితర విభాగాల్లో ప్రస్తుతం 1200 మందికి, 2026 నాటికి 3 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ‘హైదరాబాద్ గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్ రంగాలకు ముఖద్వారంగా ఎదుగుతోందన్నారు. ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, 800కు పైగా ఫార్మా కంపెనీలు, ప్రముఖ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ జీసీసీలు, అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో గ్లోబల్ హెల్త్ కేర్ హబ్ గా రూపాంతరం చెందుతోందని, అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూనే ఆరోగ్య సంరక్షణను ప్రపంచానికి అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, హెచ్ సీఏ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మైక్ మార్క్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్, హైదరాబాద్ సెంటర్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ అతుల్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Splitsville review: ఈ బోల్డ్ కామెడీ చూడాలనుకుంటే ఏం చేయాలో తెలుసా..

ప్రోత్సహిస్తే అద్భుతాలు

యువతలో అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని, వారిని మనం ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా తూంకుంటలోని అలంకృత రిసార్ట్‌లో ‘డేర్ టూ డ్రీమ్’ పేరిట సిఖ్ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఆలోచనలకు, ఆకాంక్షలకు పరిమితులు పెట్టుకోవద్దని యువతకు దిశా నిర్దేశం చేశారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సిఖ్ సొసైటీ ప్రతినిధులు తేజ్ దీప్ కౌర్, గగన్ కోహ్లీ, సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Big Breaking: తెలంగాణలో ఓజీకి ఎదురుదెబ్బ.. ప్రీమియర్స్ ఇక లేనట్లేనా?

Just In

01

BC Reservations: బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు.. కొట్టి పారేసిన ధర్మాసనం

Telangana BJP: కొత్త నేతలతో టీమ్ వర్క్‌కు బీజేపీ ప్లాన్.. సమన్వయం కుదిరేనా..!

TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?

Thummala Nageswara Rao: మంత్రి హెచ్చరించినా.. మారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యోగుల తీరు!

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!