Big Breaking: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ చిత్రానికి తెలంగాణలో హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ చిత్రానికి బెనిఫిట్ షో, టికెట్ల రేట్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే, ఇప్పటికే ఈ రోజు రాత్రి 10 గంటలకు పడాల్సిన ప్రీమియర్స్, కొనుగోలు చేసిన టికెట్లపై స్పష్టత రావాల్సి ఉంది. ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్.
ఓజీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ హోంశాఖ మెమోను జారీ చేసింది. హోంశాఖ మెమోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్ కు ఎలాంటి అధికారాలు లేవని పిటిషన్ తరపు న్యాయవాది వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్ కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందన్న పిటిషన్ తరపు న్యాయవాది అన్నారు.
అలాగే, టికెట్లు అధిక ధరకు అమ్మకూడదని నిబంధనలు ఉన్నాయి, గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందన్న అన్నారు. పిటిషనర్ న్యాయవాది వాదనను పరిగణలో తీసుకుని హైకోర్టు టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీచేసిన మెమోను జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేశారు.