GHMC (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC: జీహెచ్ఎంసీ మూడు కీలక శాఖ అధికారులకు స్థానచలనం.. ఉత్తర్వులు జారీ!

GHMC: త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC)లోని పలు కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించే ముగ్గురు అధికారులకు స్థాన చలనం కల్గిస్తూ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnana) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణ పై దేశ వ్యాప్తంగా పలు అంశాలపై జరుగుతున్న చర్చ, అపోహాలకు చెక్ పెట్టేలా మున్ముందు రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా, మరింత పారదర్శకంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ను ఆదేశించినట్లు సమాచారం. ఎలక్షన్ వింగ్ ను మరింత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు వీలుగా సమర్థులైన, ఇప్పటి వరకు పలు ఎన్నికలను నిర్వహించిన అనుభవమున్న ఐఏఎస్ ఆఫీసర్ ను ఎలక్షన్ వింగ్ కు అదనపు కమిషనర్ గా నియమించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కమిషనర్ ఈ అంతర్గత బదిలీల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

హేమంత్ కేశవ్ పాటిల్

ప్రస్తుతం ఎల్బీనగర్(LB Nagar) జోనల్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్(Hemanth Keshav Patil) ను జోనల్ కమిషనర్ కొనసాగిస్తూనే, అదనంగా ఎలక్షన్ వింగ్ అదనపు కమిషనర్ బాధ్యతలను అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎలక్షన్ వింగ్ కు అదనపు కమిషనర్ గా వ్యవహారిస్తున్న అలివేలు మంగతాయారును(Alivelu Mangathayaru) స్పోర్ట్స్ వింగ్ అదనపు కమిషనర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అర్బన్ బయోడైవర్శిటీ, స్పోర్ట్స్ వింగ్ లకు అదనపు కమిషనర్ గా వ్యవహారిస్తున్న వీవీఎల్ సుభద్రాదేవిని కేవలం బయోడైవర్శిటీ వింగ్ కే పరిమితం చేసి, ఆమెను స్పోర్ట్స్ వింగ్ నుంచి తప్పించి, ఆ వింగ్ ను అలివేలు మంగతాయారుకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Also Read: Suryapet SP: పోలీసులపై దాడి జరిగిన ఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ

అన్ని రకాలుగా రెఢీ

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎపుడు వచ్చినా, ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఇప్పటికే పలు సందర్భాల్లో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పలు సందర్భాల్లో స్పష్టం చేసిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసిన జిల్లా ఎన్నికల అధికారి బూత్ లెవెల్ ఆఫీసరన్లు నియమించి ఈ నెలాఖరులో ఓటర్ల తుది జాబితాను జారీ చేయనుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వివిధ రకాల పనుల కోసం క్యాటగిరీల ప్రకారం నోడల్ ఆఫీసర్లను కూడా నియమించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎం)ల చెకింగ్, డమ్మీ బ్యాలెట్ పేపర్ తో మాక్ పోలింగ్ వంటివి పూర్తి చేశారు.

Also Read: Ramchander Rao: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం చాలా డేంజర్: రాంచందర్ రావు

Just In

01

BC Reservations: బీసీ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు.. కొట్టి పారేసిన ధర్మాసనం

Telangana BJP: కొత్త నేతలతో టీమ్ వర్క్‌కు బీజేపీ ప్లాన్.. సమన్వయం కుదిరేనా..!

TGSRTC: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై ఆర్టీసీ ఏఐ వినియోగం.. ఎందుకో తెలుసా?

Thummala Nageswara Rao: మంత్రి హెచ్చరించినా.. మారని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఉద్యోగుల తీరు!

GHMC: ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ భేటీ.. కీలక అంశాలపై చర్చ!