Ramchander Rao: కర్నాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం సరైంది కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(Ramachandra Rao) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి(Ramani) బీజేపీ లో చేరారు. బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ, కర్ణాటక(Karnataka) రాష్ట్రాలలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలు ఉన్నాయని, ఆలమట్టి ఎత్తు పెంపు కోసం కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ చేస్తుందన్నారు. డ్యాం ఎత్తు పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం ఉందని, ఆపే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు.
సీఎం సొంత జిల్లాకు అన్యాయం..
బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేశాయన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు పై సుప్రీం కోర్టు స్టే ఉన్నా.. భూ సేకరణ ఎలా చేస్తారని నిలదీశారు. పాలమూ(Palamuru)రు, నల్గొండ(Nalgoanda) జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాకు అన్యాయం జరుగుతుందని, సమ్మక్క, సారక్క ప్రాజెక్ట్ కోసం ఛత్తీస్ ఘడ్(Chhattisgarh) లో ఉన్న బీజేపీ(BJP) ప్రభుత్వం ఎన్ఓసీ ఇచ్చిందన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా కాంగ్రెస్ కర్ణాటక తో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. 519 అడుగుల ఎత్తు వరకే ఆల్మట్టి ఉంచాలన్నారు. 524 అడుగులకు పెంచకుండా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చర్చించాలన్నారు.
Also Read: Telangana Excise: దుమ్ము రేపుతున్న ఎక్సైజ్ పోలీసులు.. వారం రోజుల్లోనే 68.76లక్షల మద్యం సీజ్
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా..
సుప్రీం కోర్టులో స్టే ఉన్న నేపథ్యంలో భూ సేకరణ చేయవద్దు.. కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) గా ఉన్నప్పుడు కృష్ణ బేసిన్ లో నీటి వాటా పైన హక్కు ఉండేదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 299 టీఎంసీల తక్కువ నీటి వాటాకు కేసీఆర్(KCR) సంతకం పెట్టారన్నారు. సీఎం ప్రతిసారి ఢిల్లీ(Delhi) వెళ్తున్నారని, కానీ కర్ణాటక వల్ల తెలంగాణకు నీటి వాటాలో నష్టం జరుగుతుందని సోనియా(Sonia), రాహుల్(Rahul) , ప్రియాంక(Priyanka)ల తో, చర్చ చేయరని, కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? ఆల్మట్టి పై ఎందుకు చర్చించరు? అని నిలదీశారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) ల వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని మండిపడ్డారు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం ద్వారా పాలమూరు, నల్లగొండ జిల్లాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఫర్ ది పీపుల్ ప్రభుత్వం కాదు అని మండిపడ్డారు.
Also Read: India vs Pakisthan: మెున్న హారీస్ రౌఫ్.. ఇప్పుడు పాక్ మహిళా క్రికెటర్.. నెట్టింట చెత్త పోస్ట్!