Bhadradri Kothagudem ( IMAGE credit: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఆదివాసి అడవి బిడ్డలకు తీరని తిప్పలు

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని సుందరయ్య నగర్ ఆదివాసి గ్రామానికి చెందిన జ్యోతి అనే గర్భిణీ మహిళకు  పురిటి నొప్పులు రావడంతో డోలి కట్టి జానంపేట ఆస్పత్రికి జ్యోతి కుటుంబ సభ్యులు చేర్చారు. ఈ విషయమై భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ , నేషనల్ హ్యూమన్ రైట్స్ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి రమేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. రోడ్డు మార్గం, సరిగా లేక, అంబులెన్స్ వెళ్ళే మార్గం లేక పోవటం తో ఆదివాసిలకు ఈ తిప్పలు తప్పడం లేదు. పినపాక నియోజకవర్గం మొత్తం కూడా ఆదివాసి నియోజకవర్గమే, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా ఆదివాసులే అయినా కానీ స్థానిక ఎమ్మెల్యేలు ఆదివాసులకు చేసిన మేలు అంటూ చెప్పుకోడానికి ఏమీ లేదు. అనేక కుగ్రామాలు నేటికీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు కరెంటు సదుపాయం లేని గ్రామాలు అనేకం ఉన్నాయి.

 Also Read: OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా ఉండదు

అదేవిధంగా వానాకాలం వస్తే మలేరియా డెంగ్యూ విష జ్వరాలు ప్రభలే గ్రామాలు చాలా ఉన్నాయి. వీరికి తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా ఉండదు. ఆదివాసీలను ఆదివాసి గ్రామాలను ఉద్ధరిస్తామని చెప్పుకొని ఎన్నికలలో మాయ మాటలు చెప్పి గెలిచిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు తర్వాత ఆదివాసి గ్రామాలను కన్నెత్తి చూసిన సందర్భాలు లేవనే చెప్పుకోవాలి. ఐటీడీఏ నుండి ఆదివాసికుగ్రామాలను అభివృద్ధి పరచడానికి అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కూడా వాటిని గ్రామాలను అభివృద్ధి పరచడంలో స్థానిక ఎమ్మెల్యేలు ఘోరంగా విఫలం చెందారు.

ఆదివాసి గ్రామాలను అభివృద్ధి పరచాలి

ఇటు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు కేటాయించకపోగా, కేంద్ర ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా ఇస్తున్న నిధులను సద్వినియోగపర్చుకోవడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఘోరంగా విఫలం చెంగారు. మనం గెలిపించుకున్నది వీరినా అని గిరిజన గ్రామ వాసులు వాపోతున్నారు. ఇకనైనా ఆదివాసి గిరిజన గ్రామాలను అభివృద్ధి పరచడంలో పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేక దృష్టి పెట్టి తక్షణమే ఆదివాసి గ్రామాలను అభివృద్ధి పరచాలని లింగంపల్లి రమేష్ డిమాండ్ చేశారు.

 Also Read: Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ఎల్బీస్టేడియం నుంచి వేరే స్టేడియానికి మార్పు.. ఎక్కడంటే?

ఫ్యాన్స్ కు ఇవ్వకపోతే అంతే మరి..!

పవన్ కళ్యాణ్ అంటే ఇటు సినిమాల్లోనూ.. అటు రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామ పరిపాలనలో మంచి మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకొని తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే గత రెండేళ్లుగా సినిమా షూటింగ్లో ఉన్న ఓజి చిత్రం గురువారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాచలం ఏషియన్ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ కు టికెట్లు ఇవ్వకుండా అక్రమంగా వాళ్లకు నచ్చిన నలుగురు వ్యక్తులకే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఏషియన్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ కు టికెట్లు ఇవ్వకపోవడంతో షో రద్దయిందని ఫ్లెక్సీలు అంటించి ఏషియన్ థియేటర్ టికెట్స్ కౌంటర్ కు, థియేటర్ కు తాళాలు వేశారు. ఫ్యాన్స్ కు టికెట్స్ ఇవ్వకపోతే ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలిపారు.

Also Read: OG premiere: పవన్ కళ్యాణ్ కోసం ‘మిరాయ్’ ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే?.. ఫ్యాన్స్‌కు పండగే..

Just In

01

Gold Price Today: అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్ రేట్స్?

SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్

Bigg Boss Malayalam Winner: బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 విజేతగా నటి అనుమోల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?

Konda Vishweshwar Reddy: పోలింగ్ రోజు వర్షం పడితే పక్కా గెలుపు మాదే: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి