pawan-kalyan(image :x)
ఎంటర్‌టైన్మెంట్

OG premiere: పవన్ కళ్యాణ్ కోసం ‘మిరాయ్’ ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే?.. ఫ్యాన్స్‌కు పండగే..

OG premiere: ఓజీ’ సినిమాకోసం ‘మిరాయ్’ ప్రొడ్యూసర్ ఎవరూ చేయలేనిపని చేశారు. దీనిని చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అది ఏంటంటే.. ‘ఓజీ’ ప్రీమియర్ షోల కోసం ‘మిరాయ్’ సినిమా ఆడుతున్న థియోటర్లలోఓజీ’ సినిమా ప్రీమియర్ కు కేటాయించనున్నారు. ‘ఓజీ’ సినిమా కోసం ‘మిరాయ్’ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సినిమా మరింత మంది అభిమానులకు రీచ్ అవుతుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో మిరాయ్ సినిమాను ఆపి ఓజీ వేయనున్నారు. ఓజీ సినిమా విడుదలకు సహకరించిన టీజీ విశ్వ ప్రసాద్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఓజీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ హైప్ ఉందో తెలిసిందే అయితే ఇలా మరిన్ని థియేటర్లు పెరిగితే ఇండస్ట్రీ పరంగా కమిర్షియల్ హిట్ ఖాయం అంటున్నారు అభిమానులు. ఓజీ కోసం ఇంత పని చేసిన నిర్మాతలకు పవన్ కళ్యాణ్ అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Read also-Post Office Schemes 2025: మహిళల కోసం బెస్ట్ స్కీమ్స్.. వీటిలో పెట్టుబడి పెడితే.. లైఫ్ లాంగ్ హ్యపీగా బతకొచ్చు!

సినిమా కోర్ స్టోరీ ఎంటంటే.. ఒక గ్యాంగ్‌స్టర్ రిటర్న్‌ చుట్టూ తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ ప్లే చేసే ‘ఓజస్ గంభీర’ (Ojas Gambheera) అనే క్యారెక్టర్, 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు. ఆయన ముందు గ్యాంగ్ లైఫ్‌లో ఒక పాత శత్రువుతో (ఎమ్రాన్ హాష్మీ ప్లే చేసే ‘ఓమి భావు‘) సెటిల్ చేసుకోవాలని మనసులో పెట్టుకుని, రివెంజ్ మిషన్‌లో ఎంబార్క్ అవుతాడు. ఇది కేవలం యాక్షన్ కాదు ఇది భావోద్వేగాలతో కూడిన డార్క్ డ్రామా. పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్, బాడీ లాంగ్వేజ్, అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ ఇంటెన్సిటీ ఇవన్నీ స్క్రీన్ మీద అభిమానులకు కావాల్సినట్టుగా ఉంటాయి.

Read also-OG release hurdles: విడుదలకు ముందు ‘ఓజీ’పై జరుగుతున్న ఆ కుట్రలు నిజమేనా?.. ఎందుకంటే?

‘ఓజీ’ సినిమా వెనుక ఉన్న క్రూ ఒక స్టార్ టీమ్ చిత్రాన్ని భారీ విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. డైరెక్టర్ సుజీత్, ‘సాహో’ ఫేమ్‌తో, స్టైలిష్ యాక్షన్, గ్రిప్పింగ్ నరేషన్‌తో మ్యాజిక్ చేశాడు. ప్రొడ్యూసర్ డి.వి.వి. దానయ్య, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన అనుభవంతో, రూ.250 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. సినిమాటోగ్రఫీ రవి కె. చంద్రన్ చేత అద్భుతమైన విజువల్స్‌తో, ఎడిటింగ్ నవీన్ నూలి చేత క్రిస్ప్‌గా రూపుదిద్ధుకుంది. థమన్ ఎస్ మ్యూజిక్ మాస్ బీట్స్‌తో స్క్రీన్‌ను షేక్ చేసేలా కంపోజ్ చేశారు. స్క్రిప్ట్ రైటర్స్ సైనాధ్ అల్లా, సుజీత్ కలిసి, ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు బలమైన కథనాన్ని అందించారు. ఈ టీమ్‌వర్క్ ‘ఓజీ’ని ఒక ఐకానిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వనుంది.

Just In

01

Hijras Attack Nurse: హిజ్రాల రౌడీయిజం.. డబ్బు ఇవ్వలేదని.. నర్సు బట్టలు చించి వీరంగం!

Canara Bank Recruitment 2025 : కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025

OG Premier: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ప్రీమియర్ షో పడేది ఎప్పుడో తెలుసా?.. ఎక్కడంటే?

Government Complex: ఖాళీగా దర్శనమిస్తున్న మార్కెట్ యార్డ్ ప్రభుత్వ షాపులు.. దృష్టి సారించని అధికారులు

Ambati Rambabu comments: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాపై అంబటి రాంబాబు కామెంట్స్ వైరల్.. ఏమన్నాడంటే?