CM Revanth Reddy ( MAGE credit: swetcha reporter)
హైదరాబాద్

CM Revanth Reddy: 26న బతుకమ్మ కుంటను ప్రారంభించనున్న.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఈ నెల 29 న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతో పాటు, 26న రాష్ట్ర ముఖ్యమంత్రి (CM Revanth Reddy) పాల్గొనే బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు (K. Ramakrishna Rao) అధికారులను ఆదేశించారు. 29 న నిర్వహించే కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డ్ లో నమోదయ్యే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై నేడు సంబంధిత ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ…

అంబర్ పేట్ లో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మ కుంట లో నిర్వహించే బతుకమ్మ సంబరాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి 26 న పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో హాజరవుతున్నందున తగు ఏర్పాట్లను చేపట్టాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులను ఆదేశించారు. బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ప్రజాప్రతినిధులు, వీఐపీ లకు సకాలంలో పంపించాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ను ఆదేశించారు. సాయంత్రం 4 గంటల నుండే పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ కుంటకు చేరుకునే అవకాశమున్నందున శానిటేషన్, తగు బందోబస్తు, తాగునీటి సదుపాయం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని అన్నారు.

గిన్నెస్ బుక్ రికార్డ్ లో నమోదయ్యే అవకాశం

అదేవిధంగా, 29 న సరూర్ నగర్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ కార్యక్రమం గిన్నెస్ బుక్ రికార్డ్ లో నమోదయ్యే అవకాశం ఉందని, ఈ కార్యక్రమంలో దాదాపు 10 వేలకు పైగా మహిళలు బతుకమ్మలతో హాజరవుతారని వెల్లడించారు. సరూర్ నగర్ స్టేడియంలోనూ మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు తో పాటు స్టేజి ఏర్పాట్లు, విద్యుదీకరణ, శానిటేషన్ లను చేపట్టాలని రామకృష్ణా రావు స్పష్టం చేశారు. వీటితో పాటు, 27 న ట్యాంక్ బండ్ పై సాయంత్రం బతుకమ్మ కార్నివల్, 29 న పీపుల్స్ ప్లాజా, 30 న ట్యాంక్ బండ్ పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.

శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి

ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, ఆర్టీసీ ఎం.డీ సజ్జనార్, హైడ్రా కమీషనర్ రంగనాధ్, జీహెచ్ ఎంసీ కమీషనర్ కర్ణన్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాల కలెక్టర్లు హరిచందన, నారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Also Read: Big Breaking: తెలంగాణలో ఓజీకి ఎదురుదెబ్బ.. ప్రీమియర్స్ ఇక లేనట్లేనా?

Just In

01

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!

Seethakka: మేడారం కీర్తి వెయ్యేళ్లు నిలిచేలా అభివృద్ధి పనులు ఉండాలి.. మంత్రి సీతక్కఆదేశం

CM Revanth Reddy: ఆ ప్రాంత ప్రజలకు సమస్యల పరిష్కారం లక్యంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి

Operation Numkhor: భారతదేశంలోకి అక్రమంగా లగ్జరీ కార్ల తరలింపులో కదులుతున్న డొంక – లిస్ట్‌లో ప్రముఖ నటులు!