Smiling Emoji Murder (Image Source: Twitter)
క్రైమ్

Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య

Smiling Emoji Murder: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌పై తలెత్తిన వివాదం యువకుడి హత్యకు దారి తీసింది. బిహార్ కు చెందిన 20 ఏళ్ల ప్రిన్స్ కుమార్.. గుజరాత్ రాజ్ కోట్ లోని ఓ ఫ్యాక్టరీలో బంధువులతో కలిసి కూలిగా పనిచేస్తున్నాడు. 4 నెలల క్రితం మరణించిన తన తాత రూప్ నారాయణ భింద్ జ్ఞాపకార్థం ఫేస్‌బుక్‌లో ఇటీవల స్టోరీ పెట్టాడు. అయితే అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న బిహార్ కు చెందిన బిపిన్ కుమార్.. ఆ స్టోరీపై లాఫింగ్ ఎమోజీ పెట్టడంతో వాగ్వాదం మెుదలైంది.

దాడి ఎలా జరిగింది?
తాత మరణించిన బాధలో ఉన్న ప్రిన్స్ కుమార్.. స్లైలింగ్ ఏమోజీని తట్టుకోలేకపోయాడు. ముందుగానే పరిచయం ఉండటంతో బిపిన్ కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ప్రిన్స్, బిపిన్ మధ్య ఫోన్ లో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 12 అర్ధరాత్రి 12:30 సమయంలో ప్రిన్స్ తన ఫ్యాక్టరీ బయట ఆటోలో కూర్చుని ఉండగా.. బిపిన్ తన ఫ్రెండ్ బ్రిజేష్ గోండ్ తో కలిసి అక్కడికి వచ్చాడు. బిపిన్ తో మాట్లాడటం ఇష్టంలేని ప్రిన్స్ అక్కడి నుంచి తిరిగి ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు యత్నించాడు.

స్థానికులు గమనించి..
అయితే ఫ్యాక్టరీలోకి వెళ్లబోతున్న ప్రిన్స్ ను బిపిన్ స్నేహితుడు బ్రిజేష్ అడ్డుకున్నాడు. చంపేస్తానని బెదిరించాడు. వార్నింగ్ ఇస్తున్న క్రమంలోనే బిపిన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా ప్రిన్స్ పై దాడి చేశాడు. ప్రిన్స్ పెద్దగా అరవడంతో ఫ్యాక్టరీలోని సహచరులు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. బిపిన్, బ్రిజేష్ లను అడ్డుకొని.. ప్రిన్స్ ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రిన్స్ పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు వెంటనే రాజ్ కోట్ సివిల్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి
ఒంటిపై తీవ్రగాయాలు అయినప్పటికీ.. ప్రిన్స్ అపస్మారక స్థితిలోకి వెళ్లలేదు. దాడికి సంబంధించిన వివరాలను పోలీసులకు ప్రిన్స్ తెలియజేశాడు. అయితే చికిత్స పొందుతూ నాలుగు రోజుల తర్వాత ప్రిన్స్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రిన్స్ వీపు భాగంలో 1.5 నుండి 2 ఇంచుల లోతైన గాయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక వైద్య నివేదికలో గాయం తీవ్రమైనది కాదని వైద్యులు పేర్కొన్నట్లు చెప్పారు. అయితే పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్చారని.. చివరికి సెప్టెంబర్ 22 ఉదయం 2:30 గంటలకు ప్రిన్స్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

Also Read: Jogulamba Temple: జోగులాంబ ఆలయ మిస్టరీ.. అమ్మవారిని నేరుగా ఎందుకు దర్శించుకోరో తెలుసా?

ఒకరు అరెస్ట్.. మరొకరు పరారీ
ప్రిన్స్ మరణవార్త తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు బిపిన్ ను సోమవారం రాత్రి (సెప్టెంబర్ 22) అరెస్ట్ చేశారు. రెండో నిందితుడు బ్రిజేష్ గోండ్ పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత – 2023లోని 103 (1) సెక్షన్ (హత్య) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ప్రిన్స్ మరణానికి గల కారణం.. గాయమా? లేక ఇన్ఫెక్షన్‌నా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Hijras Attack Nurse: హిజ్రాల రౌడీయిజం.. డబ్బు ఇవ్వలేదని.. నర్సు బట్టలు చించి వీరంగం!

Just In

01

Telangana Tourism: మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం

Sunita Ahuja interview: బాలీవుడ్ నటుడు గోవిందపై సంచలన వ్యాఖ్యలు చేసిన భార్య సునీత..

Oppo Reno 15 Series: ఒప్పో రెనో 15 సిరీస్.. లాంచ్ కి ముందే లీకైన స్పెసిఫికేషన్స్, ఫీచర్లు!

Harish Rao: నిర్మాణ అనుమతులకు 30 శాతం కమీషన్లు ఎందుకు: హరీష్ రావు ఫైర్

CM Yogi Adityanath: యూపీ సీఎం మరో సంచలనం.. ఇకపై స్కూళ్లల్లో అది తప్పనిసరి.. కీలక ఆదేశాలు జారీ