Hero Vishwaksen Shocking Comments About Real Name
Cinema

Viral Comments: మాస్‌ కా దాస్‌ షాకింగ్‌ న్యూస్‌ రివీల్

Hero Vishwaksen Shocking Comments About Real Name: టాలీవుడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీతో ఆడియెన్స్ ముందుకు ఎంట్రీ ఇచ్చాడు. క‌ృష్ణ చైతన్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ మే 31న థియేటర్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లను రాబడుతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కి సంచలన విషయాలను పంచుకున్నాడు. తన అసలు పేరు విశ్వక్‌సేన్‌ కాదని రివీల్ చేశాడు. విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ.. నా అసలు పేరు దినేష్. పాస్ పోర్ట్, నా ఆధార్ మీద కూడా అదే పేరు ఉంటుంది. అయితే ఈ పేరు నీకు ఉంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఎవ్వరు నిన్ను గుర్తుపట్టరు అని చెప్పారని మా నాన్నకి చెప్పారంట. అలాంటి టైమ్‌లో మా నాన్న వచ్చి ఈ దినేష్ అనే పేరుతో నిన్ను ఎవ్వరు కూడా గుర్తుపట్టరంట.

Also Read: అందాల తార ఇల్లు, చాలా కాస్ట్లీ గురూ..! 

పేరు మార్చుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు. ఇక నేను కూడా సరే అన్నాను. అంతేకాదు రెండు పేర్లు ఉన్నట్లు ఉంటుందని నేను ఓకే చెప్పాను. కొన్ని నేమ్స్ పేపర్ మీద రాసి ఇవ్వమన్నాను. అందులో విశ్వక్ సేన్ నాకు నచ్చింది. అయితే ఇది బెంగాలీ నేమ్.. దీన్ని ఎందుకు సెలక్ట్ చేసుకున్నావు అన్నారు. మరి పేపర్లో ఎందుకు పెట్టారు నాకు ఇదే నచ్చింది. ఈ పేరే ఫిక్స్ చెయ్యండి అని చెప్పా అంటూ చెప్పుకొచ్చారు. అంటే తన లైఫ్‌లో సక్సెస్ కోసమే విశ్వక్ సేన్‌గా తన పేరు మార్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు ఈ మాస్ కా దాస్‌.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!