Delhi Baba (Image Source: Twitter)
క్రైమ్, జాతీయం

Delhi Baba: బాబా ముసుగులో రాసలీలలు.. 17 మందిపై లైంగిక దాడి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Delhi Baba: దిల్లీ లోని వసంత్ కుంజ్‌ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ ఆశ్రమ డైరెక్టర్‌పై లైంగిక దాడి ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. 17 విద్యార్థినులను ఆయన శారీరకంగా వేధించాడని ఆరోపణలు వచ్చినట్లు దిల్లీ పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే..
శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌ (Sri Sharda Institute of Indian Management)కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న స్వామి చైతన్యానంద సరస్వతి (Swami Chaitanyananda Saraswati) అలియాస్ పార్థసారథిపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తన సంస్థ అందించే స్కాలర్ షిప్ తో పీజీ చేస్తున్న విద్యార్థినులను ఆయన వేధించారని ఆరోపణలు వెల్లువడ్డాయి. మొత్తం 32 మంది విద్యార్థినులు స్వామి చైతన్యానందపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. వారిలో 17 మంది.. స్వామి చైతన్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

శారీరకంగా తాకుతూ..
చైతన్యానంద సరస్వతి తమతో అసభ్యంగా మాట్లాడారని.. అశ్లీల సందేశాలు పంపారని బాధిత విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. అలాగే శారీరకంగా ఎక్కడ పడితే అక్కడ తాకడం చేశాడని ఆరోపించారు. కొంతమంది మహిళా ఫ్యాకల్టీ, ఆశ్రమ సిబ్బంది కూడా చైతన్యానందకు లోబడి ఉండాలని ఒత్తిడి తెచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హాస్టల్ వార్డెన్లు తమను బాబాకు పరిచయం చేశారని.. అప్పటి నుంచి వేధింపులు మెుదలయ్యాయని బాధిత విద్యార్థినులు పేర్కొన్నారు.

పోలీసుల చర్యలు
విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా దిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. స్వామి చైతన్యానందపై లైంగిక వేధింపులు, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సౌత్ వెస్ట్ జిల్లా డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. నిందితుడి ఆశ్రమం, నివాసంలో దాడులు జరిపి సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా తాము పరిశీలించినట్లు చెప్పారు. అయితే చైతన్యానంద ప్రస్తుతం పరారీలో ఉన్నారని స్పష్టం చేశారు. చివరిసారిగా ఆగ్రా ప్రాంతంలో ఆయన కనిపించినట్లు సమాచారం వచ్చిందని, పోలీసు బృందాలు అతడి కోసం గాలిస్తున్నాయని డీసీపీ వివరించారు.

Also Read: Post Office Schemes 2025: మహిళల కోసం బెస్ట్ స్కీమ్స్.. వీటిలో పెట్టుబడి పెడితే.. లైఫ్ లాంగ్ హ్యపీగా బతకొచ్చు!

శ్రీ శారద, శృంగేరి పీఠాల స్పందన
దర్యాప్తు సమయంలో ఇన్స్టిట్యూట్ బేస్‌మెంట్‌లోని వోల్వో కార్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది స్వామి చైతన్యానంద వినియోగిస్తున్నట్లు తేలింది. ఆ కారుపై నకిలీ డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్ (39 UN 1) అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు స్వామి చైతన్యానందను పదవి నుంచి తొలగించి ఆశ్రమం నుంచి బహిష్కరించారు. దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం, శృంగేరి ఒక ప్రకటన విడుదల చేస్తూ ‘స్వామి చైతన్యానంద ప్రవర్తన, చర్యలు అక్రమం, అనుచితం. పీఠం ఆవశ్యకతలకు విరుద్ధం. అందువల్ల ఆయనతో అన్ని సంబంధాలను తెంచుకున్నాము’ అని స్పష్టం చేసింది.

Also Read: Smallest Vande Bharat: వందే భారత్‌ రైళ్లకు కజిన్స్ ఉన్నాయని తెలుసా? సేమ్ సేమ్ బట్ డిఫరెంట్!

Just In

01

OG Movie: ‘మిరాయ్’ మాత్రమే కాదు.. ‘లిటిల్ హార్ట్స్’ థియేటర్లు కూడా.. బన్నీ వాసు సంచలన ప్రకటన

OTT Movie: బాయ్ ఫ్రెండ్ మీద కోపంతో మాఫియా డాన్ తో సంబంధం.. చివరకు ఏం జరిగిందంటే?

Smiling Emoji Murder: తాత మరణంపై ఫేస్ బుక్ పోస్ట్.. స్మైలింగ్ ఎమోజీ పెట్టాడని.. యువకుడి హత్య

OTT Movie: ఫ్యామిలీ సీక్రెట్ తెలుసుకునే క్రమంలో బయటపడిన డెడ్ బాడీ.. ఏం జరిగిందంటే?

OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!