Boyinapalli Vinodh Kumar: పెండింగ్ రిజర్వాయర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Vinodh Kumar) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ కు మంత్రి ఉత్తమ్(Min Uttam) అనుమతులు సాధించినట్టు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఛత్తీస్ ఘడ్ తో యాభై ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. సమ్మక్క బ్యారేజ్ కు కొత్తగా అనుమతులు సాధించినట్టు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు.
ఉద్యమానికి భయపడి..
2001 లో కేసీఆర్(KCR) తెలంగాణ ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు(Chandrababu) దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, 811 కోట్లతో అప్పట్లో దేవాదులకు జీవో వచ్చారని, 2009లో గానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టు నుంచి సరిగా నీళ్లు తోడలేక పోయారన్నారు. ఇన్ టెక్ వెల్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. 170 రోజులు నీళ్లు తోడాల్సిఉండగా 110 రోజులు కూడా దేవాదులతో నీళ్లు రాలేదన్నారు. 37 టీఎంసీ ల నీళ్లు కూడా కాంగ్రెస్(Congress) పాలనలో తోడలేదన్నారు. ఫుట్ వాల్ కూడా సరిగా పెట్టకుండా దేవాదుల డిజైన్ చేశారని అయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారన్నారు. దేవాదులను పటిష్టం చేసేందుకు 7 టీఎంసీ ల సామర్థ్యంతో సమ్మక్క సారక్క బ్యారేజ్ ను కేసీఆర్(KCR) నిర్మించారన్నారు.
Also Read: Manchu Manoj: అయోధ్య రాములవారిని దర్శించుకుని క్షమాపణలు చెప్పిన బ్లాక్ స్వార్డ్.. విషయమిదే!
కేసీఆర్ కు అనుమతులు..
సమ్మక్క బ్యారేజ్ కు ఛత్తీస్ ఘడ్ అభ్యంతరాలతో సీబ్ల్యూసీ అనుమతులు ఇవ్వలేదన్నారు. 2023 ఎన్నికల సందర్భంగా ఛత్తిస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి కేసీఆర్ కు అనుమతులు దక్కకుండా చేశారని మండిపడ్డారు. అప్పుడు ఛత్తీస్ ఘడ్ సంతకం చేసిన ఒప్పంద పత్రాన్ని ఉత్తమ్ తీసుకొచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ పై మహారాష్ట్ర తో చర్చలు జరుపుతామని రేవంత్ రెడ్డి(CM Revanth) అంటున్నారని, 152 మీటర్ల కు తక్కువగా బ్యారేజ్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదని డిమాండ్ చేశారు. దేవాదుల పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు కు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ కు మరమ్మత్తులు మొదలు పెట్టి అందుబాటులోకి తేవాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు డి .వినయ్ భాస్కర్ , డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.
Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికల ప్రక్రియ స్పీడప్.. జీవో జారీకి సర్కార్ కసరత్తు!