Electricity Shortage ( image credit; swetcha reporer)
నార్త్ తెలంగాణ

Electricity Shortage: ఆ గ్రామాల్లో విద్యుత్ కొరతతో.. అల్లాడుతున్న ప్రజలు.. పట్టించుకోని అధికారులు

Electricity Shortage:  ఏన్కూరు మండల పరిధిలో పలు గ్రామాల్లో విద్యుత్ కొరతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మండలంలో పలు గ్రామాల్లో ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ కోతలు (Electricity Shortage) విధిస్తున్నారు. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. తరచూ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది నిత్యం మరమత్తులు పేరిట గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని చెబుతూ ఇష్టానుసారంగ కోతలు పెడుతున్నారు. సాంకేతిక కారణాలు అంటూ చెట్లకొమ్మలు తొలగించాలంటూ మరింత అదనంగా విధిస్తున్నారు.

 Also Read: Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

ఇష్టానుసారంగా ఎల్సీలు ఇచ్చి విద్యుత్ కోతలకు కారణం

రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ ఎప్పుడు వస్తాదో ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే వర్షాకాలం దోమలతో ప్రజలు చిన్న పిల్లలు వృద్ధులు అల్లాడిపోతుంటే. విద్యుత్తు ఇలా పోవడంతో అనారోగ్య సమస్యల పాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు విధి నిర్వహణలో లేని బయట వ్యక్తులకు ఇష్టానుసారంగా ఎల్సీలు ఇచ్చి విద్యుత్ కోతలకు కారణం అవుతున్నారని, ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో విద్యుత్ సమస్యలపై దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

 Also Read: Mahabubabad District: తొర్రూరు మున్సిపాలిటీలో వివాదం.. శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు?

తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్ జట్టుకు తాటిగూడెం యువతి

తెలంగాణ అండర్ -15 మహిళ క్రికెట్ ప్రాబబుల్ జట్టుకు కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామానికి చెందిన బాలిక రామటెంకి దేవిప్రియ ఎంపికైంది. చదువుతు క్రికెట్ లో సత్తా సాటి, తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్ జట్టుకు ఎంపిక అవ్వడం పట్ల తల్లిదండ్రులు ఉమామహేశ్వరి.. హనుమంతరావు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్ ఆడుతూ పట్టుదలతో పోటి పరీక్షల్లో సత్తా సాటి ఉపాధ్యాయుడు అయ్యాడు.

మహిళ క్రికెట్ అండర్-15 సెలక్షన్

తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినా తనలో క్రికెట్ అనే ఆశ అలాగనే ఉండిపోయింది. తన కూతురు దేవిప్రియ ను క్రికెట్ ప్లేయర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి ప్రోత్సాహంతో హైదరాబాద్ లో నిర్వహించిన మహిళ క్రికెట్ అండర్-15 సెలక్షన్ లో దేవి ప్రియ ఎంపికయ్యింది. హెడ్ కోచ్ సురేందర్ రెడ్డి, కోచ్ లు వెంకట్ యాదవ్, బుచ్చిబాబు, రంజి కోచ్ ఇర్ఫాన్ సైతం ప్రత్యేకంగా అభినందించారు. కరకగూడెం మండాలనికి, తెలంగాణ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతంలో పుట్టిన దేవి ప్రియ అండర్ -15 మహిళ క్రికెట్ ప్రాబబుల్ జట్టుకు ఎంపిక కావడం పట్ల భద్రాద్రి జిల్లా క్రికెట్ సంఘాలు, గ్రామస్తులు, రాజకీయ నాయకులు ప్రత్యేకంగా అభినంధించారు.

 Also Read: Haris Rauf controversy: పాక్ బౌలర్ హారిస్ రౌఫ్ భార్య షాకింగ్ పోస్టు.. వివాదానికి మరింత ఆజ్యం

Just In

01

Fake Passbook: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీ ముఠా అరెస్ట్

Ram Gopal Varma: అభిమానులకు రామ్ గోపాల్ వర్మ పెద్ద పరీక్షే పెట్టాడుగా.. అదేంటంటే?

SGT Post Fraud: డీఎస్సీ 2024 ఎస్‌జి‌టి పోస్ట్ ఎంపికలో.. డ్యూయల్ క్యాస్ట్ సర్టిఫికెట్ గుట్టు రట్టు

IND vs BAN Clash: రేపే మ్యాచ్‌.. టీమిండియాపై బంగ్లాదేశ్ కోచ్ షాకింగ్ కామెంట్స్

Nongjrang Village: మహా అద్భుతం.. మేఘాల కంటే ఎత్తులో గ్రామం.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!