Mahabubabad District (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: తొర్రూరు మున్సిపాలిటీలో వివాదం.. శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు?

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ పదవి చుట్టూ వివాదం చెలరేగింది. అసలు శానిటేషన్ ఇన్స్పెక్టరా..? లేక బిల్ కలెక్టరా..? అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. స్థానికుల ఆరోపణల ప్రకారం గతంలో మున్సిపాలిటీలో శానిటేషన్ ఇన్స్పెక్టర్‌గా పని చేసిన కొమ్ము దేవేందర్‌(Kommu Devender) అక్రమాలకు పాల్పడ్డాడని, క్రమశిక్షణా చర్యలలో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో విధుల నుండి తొలగించినట్లు అధికారికంగా ఆర్డర్ కాపీ కూడా వెలువడింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ ఆర్డర్ వెలువడిన కొద్ది రోజులకే ఆయన మళ్లీ ఎలాంటి జాయినింగ్ ఆర్డర్ లేకుండా శానిటేషన్ ఇన్స్పెక్టర్‌గా చేలామణి అవుతున్నారని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.

జాయినింగ్ ఆర్డర్ లేకుండా విధులు

దీని గురించి గతంలో స్వేచ్ఛ పత్రికలో కథనం ప్రచురించబడినప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా, ఇప్పటికీ ఆయనే పదవిలో కొనసాగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా పెద్దల సహకారమా..? లేక మున్సిపల్ యంత్రాంగంలో ఉన్న అంతర్గత లబ్ధిదారుల ధైర్యం..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తొర్రూరు పట్టణ ప్రజలు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాయినింగ్ ఆర్డర్ లేకుండా ఎలాగా విధులు నిర్వర్తించగలరు..? కలెక్టర్ ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమైంది..? మున్సిపల్ కమిషనర్ ఎందుకు నిశ్శబ్దంగా చూస్తున్నారు..? అంటూ మండిపడుతున్నారు. ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు వెంటనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి, పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాన్ని వెలికితీయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని. లేదంటే మున్సిపాలిటీ ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

Also Read: OG Movie: లక్షలు పెట్టి టికెట్లు కొంటున్నారు.. ఇది కదా పవన్ కళ్యాణ్ క్రేజ్!

బతుకమ్మ ఆడే ప్రదేశం

గతంలో మహిళలు బతుకమ్మ(Bathukamma) ఆడే ప్రదేశంలో వర్షం(Rain) కారణంగా గుంతల్లో నీరు నిలించిపోయియి. అయితే యిట్టి విషయమై కమిషనర్ శానిటేషన్ అధికారిని నివేదించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారీ తీసింది. సంఘటన స్థలంలో ఉన్న పోలిసులు(Police) పరిస్థితి చేజారిపోతుందనుకోని ఇరువురికి నచ్చజెప్పారు. దింతో అధికారుల మధ్య సంఖ్యత లేకపోవడం వలనే పారిశుద్ధ్య పనుల్లో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు బలంగా అక్కడ వినిపిస్తున్నాయి.

Also Read: Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Just In

01

H1B Exemption: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!

CM Revanth Reddy: సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిలువెత్తు బంగారం సమర్పణ

DRDO Recruitment 2025: డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!

Lord Hanuman: ఇక దేవుళ్ల వంతు.. హనుమంతుడిపై నోరు పారేసుకున్న ట్రంప్ పార్టీ నేత

Crime News: జోగిపేటలో దారుణం.. పండ్ల కోసం వెళ్లి యువకుడు మృతి