Medak District: మెదక్ జిల్లా శంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నరమృగానికి సైతం సిగ్గు తెప్పించేలా, సర్వసమాజం తలదించుకునేలా ఓ ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కామాంధుడు ఏడాదిన్నర వయసున్నలేగ దూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగిన చోట అక్కడి స్ధానికులు ఓక్కసారిగా షాక్ కి గురయ్యారు.
కెమెరా ఫుటేజీ ఆదారంగా..
పూర్తి వివరాల్లోకి వెలితే గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఈ సంఘటన రికార్డు అయింది. సీసీ ఆదారంగా కెమెరా ఫుటేజీలో ఈ సంఘటన రికార్డు కావడంతో నిజం కాస్గ బయటపడింది. అదిచూసి వెంటనే అక్కడి స్థానికులు ఆ ఫుటేజీని పరిశీలించి షాక్‌కు గురయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శంకరంపేట పోలీసులు(Police) ఘటనాస్థలానికి హుటా హుడిన చేరుకుని అక్కడి సీసీ టీవి దృష్యాలను పరిషీలించారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడి పై పశువులపై అఘాయిత్యానికి సంబంధించిన వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు యువకుడిని అరెస్టు చేశారు.
మూగజీవాలపై ఇంత దారుణం..
ఈ సంఘటనతో ఆ గ్రామంలో కలకలం రేపింది. నిరపరాధి జంతువు, మూగజీవాలపై ఇంత దారుణానికి పాల్పడిన నిందితుడిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని అతి కఠిన శిక్ష విధించాలంటూ శంకరపల్లీ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి సమాచారం పోలీసులు సేకరించి, గ్రామంలో సీసీ కెమెరాల భద్రత పెంచాలని అక్కడి గ్రామస్తులు కోరారు. ప్రస్తుతం యువకుడు శంకరం పేట పోలీసుల అదుపులో ఉన్నాడు.
Also Read: Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు