Army Veterans (imagecredit:twitter)
తెలంగాణ

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Army Veterans: సర్కారీ దవాఖాన్ల లో ఇక నుంచి ఆర్మీ సెక్యూరిటీ ప్రత్యక్షం కానున్నారు.ఆర్మీలో రిటైర్ట్ అయినోళ్లను ప్రభుత్వ దవాఖాన్లలో సెక్యూరిటీ స్టాఫ్​ కింద నియామకాలు చేపట్టనున్నారు. 60:40 రేషియోలో నియామకాలు చేయాలని ప్రభుత్వం సూత్రపాయంగా నిర్ణయం తీసుకున్నది. అంటే తొలి దశలో 40 శాతం ఆర్మీ, 60 శాతం నాన్ ఆర్మీ(Army) నుంచి నియామకాలు జరగనున్నాయి. భవిష్యత్ లో పూర్తి స్థాయిలో రిటైర్డ్ ఆర్మీలతోనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానాల్లో రిక్రూట్ మెంట్లు చేయనున్నారు. ఈ విధానాన్ని స్టడీ చేసేందుకు గతంలో ప్రభుత్వం ..ఆఫీసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని పలు హాస్పిటల్స్ పాటు మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీని పరిశీలించింది. గత కొంత కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విధానంలోనే సెక్యూరిటీ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ విధానంపై అధ్యయనం చేసిన వైద్యాధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఓ రిపోర్టును అందజేశారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించిన ప్రభుత్వం రిటైర్డ్ ఆర్మీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. త్వరలోనే కొత్త విధానంలో సెక్యూరిటీ నియామకాలు జరగనున్నట్లు సచివాలయంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

పేషెంట్ కేర్ లోనూ కోర్సులు ప్రయారిటీ..?

ఇక నుంచి పేషెంట్ కేర్ వ్యవస్థలోనూ ప్రొఫెషనల్స్ నే నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఈ విధానం ఇతర దేశాలతో పాటు హైదరాబాద్ లోని కొన్ని టాప్ కార్పొరేట్ దవాఖాన్లు అమలు చేస్తున్నాయి. పేషెంట్ కేర్ విభాగంలో ఏఏన్ ఎం, జీఎన్ ఎం తో పాటు ఇతర పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వాళ్లకు ప్రాయారిటీ ఇవ్వనున్నారు. సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే తొలి విడత మెడికల్ కాలేజీల్లో దీన్ని అమలు చేసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని మెడికల్ కాలేజీ(Medical Collages)లతో పాటు హైదరాబాద్ లోని గాంధీ(Gandhi), ఉస్మానియా(OU), నిలోఫర్ వంటి హాస్పిటల్స్ లో ఈ విధానాలను అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నది. ఇక నుంచి కొత్త ఆసుపత్రుల్లో నేరుగా ఈ విధానాన్నే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే త్వరలో ప్రారంభమయ్యే అల్వాల్ టిమ్స్, సనత్ నగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిస్టంలో ఈ విధానాలను ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఆ తర్వాత క్రమంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్, పబ్లిక్ హెల్త్(Public Health) విభాగాల్లోనూ మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తామని ఆఫీసర్లు తెలిపారు.

Also Read: Temple Land Scam: ఆలయ భూములు కబ్జాలో ఈ జిల్లా టాప్..? ఎంతో తెలిస్తే షాకైపోతారు..?

ఎందుకీ నిర్ణయం…?

ప్రస్తుతం సర్కారీ దవాఖాన్లలో థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో నియామకాలు జరుగుతున్నాయి. దీని వలన ఆసుపత్రుల్లో వ్యవస్థను సమర్ధవంతంగా మెయింటెన్ చేయడంలో గందరగోళం ఏర్పడుతుంది. సెక్యూరిటీ, పేషెంట్ కేర్ ల నిర్లక్ష్​యంతో నిత్యం సర్కార్ వివాదాలకు ఇరుక్కుంటున్నది. థర్డ్ పార్టీ ఏజెన్సీ నియామకాల్లో ఎవరిని నియమిస్తున్నారనేది కూడా క్లారిటీ లేకుండా పోతున్నది. దీని వలన ఆయా స్టాఫ్​ లో కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నట్లు సర్కార్ స్టడీలో తేలింది. ముఖ్యంగా పేషెంట్ల పట్ల అ మర్యాదగా ప్రవర్తిస్తున్నారు. మరి కొందరు అయితే డాక్టర్లు, ఇతర ఆఫీసర్లను కూడా బెదిరింపులకు దిగే పరిస్థితి వచ్చింది. ఏళ్ల తరబడి పాతుకు పోయిన స్టాఫ్​ టీమ్ గా ఏర్పడి, ఆసుపత్రులనే ఏలుతున్నామనే తరహాలో వ్యవహరిస్తున్నారు. దీనికి కొందరు ఆసుపత్రి డాక్టర్లు కూడా సహకరించడం గమనార్హం. ఇక ఆసుపత్రుల్లో పేషెంట్ల నుంచి డబ్బులు తీసుకోవడం వంటివి కూడా నిత్యకృత్యమయ్యాయి. గతంలో ఇదే అంశంపై నిలోఫర్ దవాఖాన ప్రతీ సారి వివాదంలో ఇరుక్కునేది.

స్టాండర్డ్, క్వాలిటీ సేవలు…?

కొత్త విధానాన్ని అమలు చేయడం వలన సర్కారీ దవాఖాన్లలో వ్యవస్థలు బాగుపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది.రిటైర్డ్ ఆర్మీ స్టాఫ్ వర్కింగ్ స్టైల్ తో ప్రభుత్వాసుపత్రుల్లో స్టాండర్డ్‌ పెరగడంతోనే, వైద్యసేవల్లోనూ ఎలాంటి డిస్డబెన్స్ లేకుండా ఉంటుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు. రిటైర్డ్ ఆర్మీతో ఆసుపత్రుల్లో క్రమ శిక్షణ వాతావరణం తోపాటు నిఘా కూడా ఫర్ ఫెక్డ్ గా ఉంటుంది. డ్యూటీలు సమర్ధవంతంగా నిర్వహించగలరని భావిస్తున్నారు. ప్రస్తుత విధానాల్లో కొందరు డ్యూటీలు కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆసుపత్రుల్లోని కొందరు అధికారులతో కుమ్మక్కై, డుమ్మాలు కొడుతున్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ, ఆసుపత్రి అధికారులతో సత్సంబంధాలు నిర్వహిస్తే చాలు అనే తరహాలో సెక్యూరిటీ స్టాఫ్​ ముందుకు సాగుతున్నారు. ఇది ఆసుపత్రి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కారణమవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రిటైర్డ్ ఆర్మీ సెక్యూరిటీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో పేటెంట్లతో కమ్యూనికేషన్ కూడా మెరుగు పడుతుందని వైద్యారోగ్యశాఖ భావిస్తున్నది.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అంగన్‌వాడీ గుడ్ల అక్రమాలపై అధికారులు చర్యలు

Just In

01

Huzurabad District: సింగాపూర్‌లో అక్రమ మొరం తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Vasavi Group: ఓ పక్క ఐటీ దాడులు.. హైడ్రా భయంతో వాసవి గ్రూప్ ఉక్కిరిబిక్కిరి!

BJP Telangana: బీజేపీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాట.. మళ్లీ మొదలైన పాత కొత్త నేతల లొల్లి

Army Veterans: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సర్కారు ఆసుపత్రుల్లో ఆర్మీ జవాన్లు

Bathukamma 2025: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ ఉత్సవాలు.. ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు